ప్రేమంటే ఇదే.. వైరల్ వీడియో?

praveen
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో చిన్న దేశమైన ఉక్రెయిన్లో ఎంత అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనావాసాల పై కూడా రష్యా సేనలు బాంబు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎంతో మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. అదే ఈ సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు ఇక సురక్షితమైన ప్రాంతాలకు వెళ్తున్నప్పటికీ ఆయా ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని రష్యన్ సైన్యం ఇక ఏకంగా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగిస్తుంది.

 దీంతో ఏ క్షణంలో ప్రాణం పోతుందో అనే విధంగా మారిపోయింది ప్రస్తుతం పరిస్థితి. ఉక్రెయిన్లో ఇప్పటికే వందల మంది సాధారణ పౌరులు సైతం చనిపోయారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ప్రాణాలు దక్కించుకునేందుకు సాధారణ పౌరులు అందరూ కూడా విదేశాలకు వలస వెళ్తున్నారు. దాదాపు 33 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలు విదేశాలకు వలస వెళ్ళిపోయారు అన్నది తెలిసిన విషయమే. ఇక పొరుగు దేశాలకు వెళ్ళి అక్కడ తలదాచుకుంటూ ప్రాణాలను కాపాడుకుంటూ ఉన్నారు. ఇక ఇలా ఉక్రెయిన్ ప్రజలు పలు దేశాలకు వెళ్తున్న ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

 ఇటీవలే వైరల్ గా మారిపోయిన ఒక వీడియో మాత్రం అందరి మనసును కదిలిస్తోంది. ఉక్రెయిన్ బాలుడికి స్పెయిన్ స్కూల్లో పిల్లలు ఘన స్వాగతం పలికారు. ఉక్రెయిన్ బాలుడు స్కూల్ క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టగానే వేరే దేశం అనే ఫీల్ అతనికి రానీయకుండా తోటి పిల్లలు అందరు కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. అయితే చిన్నారుల కల్మషం లేని ప్రేమకు  ఇక ఈ వీడియో ఉదాహరణ అంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్లు పెడుతూనే ఉండడం గమనార్హం.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: