ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం..!!

Divya
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు తరచూ ఎక్కడో ఒకచోట మనం వింటూనే ఉన్నాం అలాగే ఒక్కో సారి చూస్తూనే ఉంటాము.. తప్పు ఎవరిదైనా సరే రోడ్డు ప్రమాదం జరిగింది అంటే ఎవరో ఒకరి ప్రాణాలు పోవాల్సిందే.. అదృష్టం బాగుంటే బ్రతికి బయటపడగలుగుతారు. ఇప్పటికే రోజురోజుకు సరిహద్దుల్లో రోడ్డు ప్రమాదాలు బాగా చోటుచేసుకుంటున్నాయి. ఇక అందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఇకపోతే ప్రైవేటు బస్సు బోల్తా పడి సుమారుగా పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇకపోతే ప్రైవేట్ బస్సు వై ఎన్ హోసకోట నుంచి పావుగడ వెళ్తుండగాఈ రోజు ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో పలవలహళ్లి దగ్గర నీ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు , వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి అక్కడి స్థానికులు తరలిస్తున్నారు. విషాధకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ బస్సు లో ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక సమాచారం అందిన వెంటనే అధికారులతోపాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదం తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని తాజాగా అధికారులు తెలిపారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు బస్ టాప్ పైన  కూర్చొని ప్రయానిస్తున్నట్లుగా ఘటన జరిగిన సమయంలో బస్ టాప్ పై ఉన్న వారు ఉన్నట్టుండి కిందకి దూకినట్లు సమాచారం. కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు ఉన్నట్టుండి ఇలా బస్సు ప్రమాదం చోటు చేసుకోవడంతో భయభ్రాంతులకు  లోనయ్యారు. ఇక ఎవరికి ఏమవుతుందో అనే ఆందోళనలో వారు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని విద్యార్థులు ప్రార్థనలు కూడా చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ట్విట్టర్ ద్వారా ఈ ఫోటోలు అక్కడి స్థానికులు షేర్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: