ఓహో.. ఈ షిప్ ముందు ఇంద్ర భవనం కూడా పనిచేయదేమో?

praveen
నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రపంచం నలు మూలల్లో ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో  వాలి పోతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ అరచేతిలోనే ప్రపంచాన్ని మొత్తం చదివేస్తున్నారు. ఇక ఇలా సోషల్ మీడియాలో కి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం లాంటివి చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకోవాలి అని కలలు కంటూ ఉంటారు. ఇష్టాలకు అనుగుణంగా సర్వాంగసుందరంగా ఇల్లు నిర్మించుకుంటే ఇక అంతకంటే ఇంకేం కావాలి అని భావిస్తూ ఉంటారు.

 ఇంద్రభవనం కంటే అందమైన ఇల్లు ఇంకెక్కడ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం అందరు షాక్ అవుతారు. ఇంతకీ ఈ వీడియో లో ఏముంది అంటారా.. ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత షాక్ అవ్వడం ఎందుకు  అంటారా... ఇక ఈ షిప్ చూస్తే ఇంద్రభవనం కూడా దీని ముందు పని చేయలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ షిప్ లో ఉన్న సదుపాయాలు చూసి ఎంతో మంది షాక్ మునిగిపోతున్నారు.. నీళ్లలో తిరిగి ఓడ లో ఇన్ని రకాల సదుపాయాల అని అనుకుంటున్నారు.

 సాధారణంగా సముద్రం లో తిరిగే ఎన్నో ఓడలను ఇప్పటికే మీరు చూసే ఉంటారు. ఇక్కడ కనిపించే ఓడ మాత్రం కాస్త డిఫరెంట్. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ షిప్ ను సముద్రంలో తిరిగే ఇంద్రభవనం అని అనుకోవచ్చు. స్పా, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్పూల్స్, రెస్టారెంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి ఎన్నో రకాల వసతులతో  నిర్మించిన షిప్ ఇది. ఇక దీని పేరు బ్రిటానియా షిప్. ఈ షిప్ కు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత జీవితంలో ఒక్కసారైనా సరే ఓడలో ప్రయాణం చేయాలి అని ప్రతి ఒక్కరికీ ఆశ కలుగుతుంది అంటే నమ్మండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: