ఒక్క చేప తో లక్షాధికారిగా మారిన జాలరి..!

Satvika
కొన్ని రకాల చేపలలో ఆరోగ్యానికి సంబంధించిన పొషక విలువలు ఎక్కువగా వుంటాయి. అలాంటి చేపలు దొరకడం కూడా కష్టమే అంతేకాదు ఒకవేళ ఎక్కడైనా దొరికినా వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. అరుదుగా దొరికే చేపలు చాలా ఖరీదు అయినవిగా వుంటాయి.. మన తెలుగు రాష్ట్రాలలొ ఇలాంటి చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయి. అందులో ముఖ్యంగా కచ్చిడి చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయి. ఆ చేప ఖరీదు అక్షరాల  లక్ష  పైగా ఉంటుంది. ఆ చేప ఒక్కటి పడితే జాలర్లకు పండగే అని చెప్పాలి.

ముఖ్యంగా మగ చేప చిక్కితే కాసుల వర్షం కురుస్తోంది. ఆ చెపలొని కొన్ని తిత్తులకు మందుల తయారిలో వాడతారు. అంతేకాదు ఆ చేప పొట్ట బాగాన్ని మందుల తయారిలొ వాడుతారు.. అంటే సర్జరీ చేసిన తర్వాత కుట్లు వేయడం కోసం వాడతారు.గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ఖరీదైన వైన్ లను తయారు చెయ్యడం లో చేప శరీర భాగాలను ఉపయొగిస్తారు. ఇన్ని రకాలుగా దీనిని వాడుతున్న నేపథ్యంలో డిమాండ్ కూడా కాస్త ఎక్కువగానే వుంటుంది.

ఇకపోతే ఈ చేపలకు మరో పేరు కూడా ఉంది. అదే గోల్డెన్ ఫిష్ అని కూడా అంటారు.. పేరుకు తగ్గట్టుగా వీటిని కోస్తా జిల్లాల్లొ బంగారు చేప అని పిలుస్తారు. ఒక్క చేప వలలో చిక్కితే అది వాల్లను లక్షాధికారిని చెస్తుంది.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 18 కెజిల చేప చిక్కింది.. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవు వద్ద సోమవారం అమ్మకానికి పెట్టగా అది లక్షన్నర పలికింది. ఆ తర్వాత అతను కోల్‌కత్తా మార్కెట్ కు మరో 50000 ఆదాయం తో అమ్ముకున్నాడు. అలా ఇద్దరు లాభం పొందారు.ఈ చేపలు ఒక చోట వుండవు. తిరుగుథూ వుంటాయి. ఎక్కడ దొరికితే అక్కడ అది చెపల వాళ్ళకు కన్నుల పండుగ.. ఈ చేపల కూర కూడా చాలా రుచిగా ఉంటుంది అందుకే ఎంత పెట్టి అయిన కొనడానికి భోజన ప్రియులు కొనడానికి సిద్ధంగా ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: