నెలసరి రక్తాన్ని తాగుతున్న మహిళ.. ఎక్కడో తెలుసా..!

MOHAN BABU
ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అలవాటు ఉంటుంది. అది ఆహారపు అలవాట్లు కావొచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక్కోసారి ఈ అలవాట్లే  మనల్ని ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడతాయి. అయితే ఈ మహిళకు ఉన్న అలవాటే ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా చేసింది.. మరి ఆమెకున్న అలవాటు ఏమిటో తెలుసుకుందాం..!


 అయితే సమాజంలో చాలామంది నెలసరి సమయంలో వచ్చేటువంటి బ్లడ్ ని చెడు రక్తంగా భావిస్తారు. భారతదేశంతో సహా పలు దేశాల్లో పీరియడ్స్ సమయంలో మహిళలను శుభకార్యాలకుగాని, దేవాలయాల పూజల్లో  పాల్గొనరు. ఆ సమయంలో ఎలాంటి మంచి పనులు చేయవద్దని, చేస్తే అపవిత్రం అని భావిస్తారు. అలాగే కనీసం ఆ రక్తాన్ని చెయ్యితో కూడా ముట్టుకోవడానికి వెనుకడుగు వేస్తారు. కానీ స్పెయిన్ లోని ఒక మహిళ విచిత్రంగా తన నెలసరి సమయంలో వచ్చే రక్తాన్ని తాగుతుంది. మీకు ఇది వినడానికి ఇబ్బందిగా, ఒళ్ళు పులకరించే విధంగా ఉంది కదూ. అవునండి నేను చెప్పేది నిజమే. ఆమె ప్రతి నెల పీరియడ్స్ సమయంలో తన రక్తాన్ని తాగుతూ దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని  వివరిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే  స్పెయిన్ కు చెందిన జాస్మిన్ అలీసియా కార్టర్ అనే మహిళ 30 సంవత్సరాలు.

https://www.instagram.com/reel/CXMCRJelxfH/?utm_source=ig_web_button_share_sheet
వివాహం కూడా అయింది. రెండేళ్ల పాప ఉంది. బార్సిలోనాలో నివసిస్తోంది. ఈమె కొద్దిరోజుల ముందు ఒక హోటల్లో వెయిటర్ గా పని చేసింది. కొన్ని రోజుల క్రితం  ఆ జాబు మానేసింది. ప్రస్తుతం ఆ మహిళ నెలసరి సమస్యలకు సంబంధించిన  సూచనలు సలహాలు ఇస్తోంది. అలాగే దీన్నే తన కెరీర్ గా కూడా ఎంచుకుంది. ఈ మధ్యనే జాస్మిన్ నెలసరికి సంబంధించి సంచలనమైన కామెంట్ చేసింది. తన నెలసరి రక్తాన్ని తాను తాగుతానని చెప్పడంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. తనకు  నెలసరి వచ్చే సమయంలో ఒక కప్పులో బ్లడ్ ని పట్టుకొని  తాగుతానని చెప్పింది. అయితే ఇలా చేయడం వలన  తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందని తెలియజేసింది.

అయితే బ్లడ్ నీ తాగడమే కాకుండా, తన ముఖానికి కూడా ఫేషియల్ క్రీమ్ లాగా పూసుకుంటుందని, తన అందానికి కూడా సీక్రెట్ అదే అని జాస్మిన్ చెప్పుకొచ్చింది. అయితే ఈ నెలసరి రక్తంలో ప్రొటీన్, ఐరన్, స్టెమ్ సెల్స్ వంటి పోషకాలు ఉంటాయని, అందుకే ఆ రక్తాన్ని తాగుతానని  దీంతో తనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది. తన నెలసరి సమయంలో వాష్ రూమ్ లోకి వెళ్లి  మెన్ స్ట్రువల్ కప్పులో పడిన బ్లడ్ ను తీసుకొని తాగుతానని తెలిపింది. అలాగే దీని ద్వారా రక్తం రంగు మరియు చిక్కదనాన్ని బట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో మనం తెలుసుకోవచ్చని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: