అజ్ఞాతంలోకి మోహన్ బాబు... కారణం అదేనా
గాయపడిన రిపోర్టర్ రంజిత్ కుమార్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి రంజిత్ కుమార్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి.. దాడి జరిగిన రోజు తప్పు తనదేనని మోహన్ బాబు ఒప్పుకున్నారు. రంజిత్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు కూడా మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మెహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జర్నలిస్ట్ రంజిత్‌ను కలిసి పరమర్శించడం జరిగింది.
రిపోర్టర్ పై దాడి చేసినందుకు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇదిలా ఉండగా మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే విచారణ జరుపి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి చంద్రగిరికి చేరుకుని.. శ్రీ విద్యానికేతన్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో మంచు మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. ఇకపోతే మోహన్ బాబు రెండు గన్స్ ని కూడా పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.