హెరాల్డ్ ఫ్లాష్‌బ్యాక్ 2024: ఎప్పుడూ బాక్సాఫీస్‌ను షేక్ చేసే అట్లీ.. ఇలా సైలెంట్ అయిపోయాడేంటి..?

praveen
* బాలీవుడ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్
* 2024 లో ఫుల్ సైలెంట్
* నీకేమైంది అట్లీ భయ్యా
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
అరుణ్ కుమార్ అలియాస్ అట్లీ కుమార్ గొప్ప దర్శకుడిగా తమిళ, హిందీ సినిమాల్లో పేరు తెచ్చుకున్నాడు. పనిచేస్తారు. దర్శకుడు శంకర్ దగ్గర "ఎంతిరన్", "నన్బన్" సినిమాలకు సహాయ దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టాడు. అట్లీ మొదటిసారిగా "రాజా రాణి" సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, కమర్షియల్‌గా కూడా పెద్ద విజయం సాధించింది. దీనితో అట్లీకి విజయ్ అవార్డ్స్‌లో ఉత్తమ నూతన దర్శకుడిగా అవార్డు వచ్చింది.
2023లో అట్లీ బాలీవుడ్‌లోకి "జవాన్" సినిమాతో అడుగుపెట్టాడు. షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన "జవాన్" విడుదలైన మొదటి రోజే రూ.129 కోట్లు వసూలు చేసి హిందీ సినిమాల్లో రికార్డు సృష్టించింది. ఫస్ట్ వీక్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.520.79 కోట్లు, మొత్తం థియేట్రికల్ రన్‌లో రూ.1150 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఇలా షారుఖ్ ఖాన్‌తో "జవాన్" వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, డైరెక్టర్ అట్లీ ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్ 2024లో అసలు ఎలాంటి కొత్త సినిమా ప్రకటించలేదు. అతన్నించి ఏ మూవీ అప్‌డేట్ రాకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. "జవాన్" సృష్టించిన ప్రభంజనంతో అట్లీ పేరు మారుమోగిపోయింది. దీంతో ఆయన తర్వాతి ప్రాజెక్టులు ఇంకెంత గొప్పగా ఉంటాయేమో అని చాలామంది వెయిట్ చేశారు. కానీ 2024లో ఎలాంటి ప్రకటన చేయకుండా ఆయన డిస్పాండ్ చేశాడు. ప్రస్తుతం అట్లీ తమిళ, హిందీ భాషల్లో పలువురు స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఫైనలైజ్ అయితే అతని డైరెక్షన్‌లో మరో కొత్త సినిమా పట్టాలెక్కొచ్చు. కమర్షియల్ హంగులతో, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే సినిమాలు తీయడంలో అట్లీ దిట్ట కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 2024లో అట్లీ నిర్మాణంలో 'బేబీ జాన్' అనే సినిమా వచ్చింది. ఇది 'తెరి'కి రీమేక్. అయితే 2024 ఆయన డైరెక్షన్ పరంగా పెద్దగా యాక్టివ్ గా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: