అల్లు అర్జున్ కాళ్ళ మీద పడ్డ చంద్రబోస్ భార్య.. ఏం జరిగిందంటే.?

Pandrala Sravanthi
ఏంటి ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి చంద్రబోస్ గారి భార్య అల్లు అర్జున్ కాళ్ళ ముందు పడిందా..ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి..అసలు వయసులో తనకంటే చిన్నవాడైనా అల్లు అర్జున్ కాళ్ళ ముందు చంద్రబోస్ భార్య పడడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకి సాహిత్యం అందించినందుకు గానూ ఆస్కార్ అవార్డు చంద్రబోస్ గారిని వరించిన సంగతి మనకు తెలిసిందే.ఆస్కార్ అవార్డుతో చంద్రబోస్ గారి కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే అలాంటి చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ కూడా ఇండస్ట్రీకి చెందిందే.ఈమె నృత్య కళాకారిణిగా.. దర్శకురాలిగా.. ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. అయితే అలాంటి సుచిత్ర చంద్రబోస్  తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2  సినిమా చూసింది.ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి ఫిదా అయిపోయిన సుచిత్ర చంద్రబోస్ అల్లు అర్జున్ ని కలవడానికి వెళ్ళింది.

అయితే ఆయన్ని కలిసి మీ సినిమా బాగుంది చాలా ఎంజాయ్ చేసింది అని చెబుతుంది అని అందరూ అనుకుంటారు. అయితే ఈ మాటలతో పాటు ఆమె అందరూ ఆశ్చర్యపోయే మరో పని చేసింది. అదేంటంటే..పుష్ప -2 సినిమా చూసి అల్లు అర్జున్ ని కలవడంతోనే ఆమె అల్లు అర్జున్ కాళ్ళ ముందు కూర్చొని మీ నటనకు సలాం అన్నట్లుగా కాళ్ల దగ్గర కూర్చొని ఆయన చేతులు పట్టుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత భార్య ఇలా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయి ఆయన కాళ్ళ ముందు మోకరిల్లడం అద్భుతం.. అల్లు అర్జున్ నటనకి ఇదే నిదర్శనం..ఇంతకంటే గొప్ప సంఘటనని చూపించలేం అంటూ చాలామంది ఈ వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు. 

ఇక ఈ సినిమా చూసిన ఎంతోమంది అల్లు అర్జున్ కి మరో నేషనల్ అవార్డు రావడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప టు సినిమాలో తన యాక్టింగ్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని జాతర సీన్స్, క్లైమాక్స్ సన్నివేశంలో బన్నీ రెచ్చిపోయిన నటించారు.ఈ సినిమాలోని జాతర సన్నివేశం చూసిన చాలామంది ఆడవాళ్ళు అయితే పూనకాలతో ఊగిపోయిన సంఘటనలు మనం ఇప్పటికే చూసాం.అలా తాజాగా చంద్రబోస్ భార్య కూడా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యి ఆయన కాళ్ల దగ్గర మోకరిల్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: