హెరాల్డ్ ప్లాష్‌బ్యాక్ 2024 : టాలీవుడ్ యంగ్ హీరోలు బోల్తాప‌డ్డారా..?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్లో అగ్ర హీరోలు సినిమాలు బాక్సాఫీస్ గేమ్ ఛేంజర్ అయిన ఏడాది మొత్తం బాక్స్ ఆఫీస్ లో నడిపించేది యంగ్ హీరోలు.. మీడియం చిన్న సినిమాలు. 2024 లో యంగ్ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. 2024 ఓ అనూహ్య విజయంతో మొదలైంది. తేజ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ పాన్ ఇండియాలో సత్తా చాటింది. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన యావరేజ్ అయింది. వరుణ్ తేజ్ ఈ ఏడాది మూడు సినిమాలు చేస్తే మూడు దెబ్బ కొట్టాయి. మట్కా అతిపెద్ద డిజాస్టర్. గోపీచంద్ రెండు సినిమాలతో వచ్చాడు. భీమా డిజాస్ట‌ర్‌. విశ్వం మాత్రం బిలో యావరేజ్. విశ్వక్ నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు వచ్చాయి. గామి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి - మెకానిక్ రాకీ అంచ‌నాలు అందుకోలేదు. శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ తో హిట్టందుకొన్నాడు. స్వాగ్‌ నిరాశపరిచింది. ఇందులో హిజ్రా పాత్ర నటుడుగా అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

డీజే టిల్లు స్క్వేర్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాడు సిద్దు జొన్నలగడ్డ. విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయింది. క్లాసిక్ టైటిల్ ఆ ఒక్కటి అడక్కు వాడుకుని అల్లరి నరేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. బచ్చలయ‌ల్లి కూడా గొప్పగా లేదన్నారు. శర్వానంద్ మనమే జనాలకు గుర్తులేదు. సుధీర్ బాబు హరోం హర, మానాన్న సూపర్ హీరో చిత్రాలు .. రెండూ విడుదలకు ముందు ఆసక్తిని పెంచాయి. రిలీజ్ తర్వాత ఉసూరనిపించాయి. రాంకు డబుల్ ఇస్మార్ట్ షాక్ ఇచ్చింది. కార్తికేయ భజే వాయు వేగం ప్లాప్‌.

నాని సరిపోదా శనివారంతో హిట్టు అందుకున్నాడు. లక్కీ భాస్కర్ విజయం సాధించాయి నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో డిజాస్టర్. శ్రీసింహ, సత్య ‘మత్తువదలరా 2′ తో మరోసారి మ్యాజిక్ చేశారు. ’35 చిన్న కథ కాదు’ మంచి సినిమాగా ప్రశంసలు అందుకుంది. కమిటీ కుర్రాళ్ళు సినిమాకి మంచి మార్కులు పడ్డాయ్. నార్నే నితిన్ బడ్డీ కామెడీ ‘ఆయ్’ థియేటర్స్ కి జనాల్ని రప్పించగలిగింది. అల్లు శిరీష్ బడ్డీ, ప్రియదర్శి డార్లింగ్, సుహాస్ చేసిన అంబాజీ పేట, ప్రసన్నవదనం, జనక అయితే గనక.. సినిమాలూ ఆడియన్స్ ని రప్పించలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: