"ఆ విషయం గురించి మాట్లాడడానికి మా ఇంటికి రావద్దు"..జూ ఎన్టీఆర్ సంచలన కామెంట్స్..!?

Thota Jaya Madhuri
జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోల్లింగ్ కి గురి అవువుతున్నాడు.  దానికి కారణం పొలిటికల్ ఇష్యూస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో కూడా ఎన్టీఆర్ పేరును పరోక్షకంగా లాగుతూ నానారాద్ధాంతం చేశారు జనాలు.  అయితే బన్నీ - అల్లు అర్జున్ మాత్రం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో స్టార్స్ అప్పుడే తమ వారసులని వారసురాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడానికి చాలా ట్రై చేస్తున్నారు .


కొన్ని కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంట్రీ ఇప్పిస్తున్నారు . ఇప్పటికే అల్లు అర్హ.. శాకుంతలం సినిమా ద్వారా తన సినీ రంగ ప్రవేశం చేసింది.  సితార కూడా రేపో మాపో అన్న రేంజ్ లోనే ప్లాన్ చేస్తుంది . అయితే ఇప్పుడు అందరి కళ్ళు ఎన్టీఆర్ కొడుకుల పై పడ్డాయి . ఎన్టీఆర్ కొడుకులు కూడా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీలు చేస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం అస్సలు తన కొడుకుల ఇండస్ట్రీలోకి రావడం ఇష్టమే లేదట .


వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వృత్తిలో సెటిల్ అయితే చూడాలి అని అనుకుంటున్నారట . వాళ్లకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు ఆపనే ఆ పను అంటూ కూడా చెప్పుకొస్తున్నారట . అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కొడుకులను చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా చూపించడానికి పలువురు  డైరెక్టర్స్ బాగా ప్లాన్ చేశారట . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ససేమీరా ఒప్పుకోలేదట . వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలి ..వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అంటూ చెప్పుకొస్తున్నారట . ఓ డైరెక్టర్ మాత్రం పదే పదే జూనియర్ ఎన్టీఆర్ కొడుకులనును చైల్డ్ ఆర్టిస్ట్ గా చూపించడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారట . అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మొహమాటం లేకుండా ముఖాన్నే ఆ విషయం గురించి మాట్లాడే పాటైతే ఇంటికి రావద్దు అంటూ ఫేస్ మీద చెప్పేసాడట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: