Viral : యూ ట్యూబ్ లో చూసి విమానం తయారు చేసిన జంట..

Purushottham Vinay
ఇక చాలా మంది కూడా యూట్యూబ్ చూస్తూ తమ టాలెంట్‌కు మరింత పదును పెట్టుకోవడంతో బిజీగా మారిపోయారు. అయితే ఓ ఫ్యామిలీకి చెందిన వారు మాత్రం ఏకంగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఓ విమానాన్నే తయారు చేసి వావ్ అనిపించారు. నాలుగు-సీట్ల విమాన  ప్రాజెక్ట్‌ను చేపట్టి విజయం సాధించడంతో వీరి ఆశయానికి హద్దులు అనేవి లేకుండాపోయాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే..38 ఏళ్ల అశోక్ అలిసెరిల్ ఇంకా అతని భార్య అభిలాషా దూబే(35) వీరి పిల్లలు తారా(6) ఇంకా దియా(3) ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యారు. కాగా, అశోక్ ట్రైనింగ్ తీసుకున్న పైలట్‌ కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. అతని ఫ్యామిలీ సహాయంతో, దాదాపు రెండు సంవత్సరాలలో విమానాన్ని నిర్మించారు ఆయన. కేవలం యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఈ ప్రాజెక్ట్‌ను చాలా విజయవంతంగా పూర్తి చేశారు.

ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌కు చెందిన ఈ ఇంజనీర్ వారికి ఆయనకు తగ్గ విమానం కొనేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ, మార్కెట్లో వారి అంచనాలకు తగ్గవి లేకపోవడంతో చాలా నిరాశపడ్డారు. దీంతో ఎలాగైన విమానాన్ని తయారు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.ఇక వారి అవసరాలకు సరిపోయే ఒక కిట్ విమానాన్ని సౌతాఫ్రికాలో కొనుగోలు చేశాడు. దానిని ఆయన ఇంటికి తెప్పించుకుని రెండేళ్లుగా అదే ప్రయత్నంలో ఉండిపోయాడు. మార్చి 2020 వ సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్ట్.. ఈ సంవత్సరం పూర్తయింది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఆయన వారి కలను నెరవేర్చుకున్నారు.ఇక ఈ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు £155,000 (రూ. 1.57 కోట్లు) అని వారు పేర్కొన్నారు. సరైన టైంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారు పనిచేశారంట. మొత్తానికి రెండేళ్ల కష్టానికి ఫలితం రావడంతో ఆ ఫ్యామిలీ సంతోషాలకు సలు అవధులు లేకుండా పోయాయి.ఇక ఈ విమానంలో ఈ ఫ్యామిలీ వేసవి సెలవుల కోసం ఐల్ ఆఫ్ వైట్‌కి వెళ్లాలని ఆశిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: