ఇక మీదట గ్యాస్..587 రూపాయలకేనట...?

Divya
దేశంలోనే గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల సామాన్య ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఇక వీటితో పాటుగా నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడుగా వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.. అంటే దాదాపుగా తొమ్మిది వందల రూపాయలకు పైగానే గ్యాస్ అమ్ముతున్నారు. ఇప్పుడు ఇది కూడా సామాన్య ప్రజలకు చాలా భారంగా మారింది.. అయితే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కూడా కొద్ది కాలం నిలిపివేసింది. దీంతో ప్రజలు అత్యధిక ధరకు గ్యాస్ ను వినియోగించడం చాలా భారంగా మారింది.

అయితే తాజాగా ఈ సబ్సిడీ విషయం గురించి ప్రభుత్వం ఆందోళన పడవద్దు అని తెలియజేసింది. సబ్సిడీ ని తిరిగి పునరుద్ధరించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తోంది. వీటికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో డొమెస్టిక్ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు. ఇక ఈ రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాలలో కూడా సబ్సిడీని విడుదల చేసే అవకాశం ఉన్నది.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఆయిల్ కంపెనీ సంస్థలకు 303 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారట. దీంతో గ్యాస్ సిలిండర్ మనకు 587 రూపాయలకే ఇవ్వనున్నట్లు గా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న వంటగ్యాస్ ధర 900 రూపాయలు ఇలాంటి సమయంలో గ్యాస్ సబ్సిడీని పొందాలంటే ఆధార్ కు లింక్ చేయాలని, అందుకు సంబంధించిన డీలర్ వద్దకు వెళ్లి మీ ఖాతాను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది.
ఇక LPG గ్యాస్ వినియోగదారుల సబ్సిడీ టోల్ ఫ్రీ నెంబర్..1800-233-3555  ఫోన్ చేసి కనుక్కోవచ్చు. కానీ 2020 లో సంవత్సరంలో 147.67 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఏప్రిల్ నెలలో అందించింది. కానీ అప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 731 ఉన్నది. కానీ ఆ తరువాత ఏకంగా 205 రూపాయలు పెరిగింది. దీంతో ఇప్పుడు 900 రూపాయలకి అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: