జగన్: గవర్నర్ తో భేటీ..రాజకీయ కొత్త వ్యూహమేనా..?
కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయం పైన PPP విధానం అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం పైన వైసిపి నేతలు, జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ వ్యవహారం పైన నిరసనలను కూడా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. అలాగే కోటి సంతకాల సేకరణ కూడా సేకరించి ఈ నెల 17న గవర్నర్ ను కలిసేందుకు జగన్ రాజ్ భవన్ నుంచి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.. రాష్ట్రంలో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే వైసిపి చేపట్టిన ఈ ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణను గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రం ద్వారా అందజేయబోతున్నారు.
గవర్నర్ తో భేటీ అనంతరం అదే రోజున పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కాబోతున్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంపై జగన్ డైరెక్ట్ గానే నిరసనలు పాల్గొనేలా షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు. జనవరి చివరి వారం నుంచి పార్టీలో మరింత జోష్ నింపడానికి బస్సు యాత్రను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలను పరామర్శించడం, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి విషయాలను ప్రజలలో బలంగా తీసుకువెళ్లేలా ప్లాన్ చేశారు. జనవరి నుంచి పూర్తిగా పార్టీకే సమయాన్ని కేటాయించాలనే విధంగా జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వ్యూహంలో భాగంగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.