ఫ్యామిలీ ఆడియన్స్ కి గుడ్ న్యూస్..సంక్రాంతికి వస్తున్నాం-2 రిలీజ్ అప్పుడే..?
ప్రస్తుతం వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన వెంటనే తిరిగి మళ్ళీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాని తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా చిత్ర బృందం ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్నట్లు తెలిసింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ మార్కు కామెడీ, డైరెక్టర్ అనిల్ రావిపూడి టేకింగ్ సూపర్ గా ఆకట్టుకున్నాయి. అయితే సీక్వెల్లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని చిత్ర బృందం ధీమాతో ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం 2 లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తో పాటుగా మరొక హీరోయిన్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీక్వెల్ వస్తే ఈసారి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ని క్యాష్ చేసుకొనే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావు పూడి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేశారు. మరి సంక్రాంతికి వస్తున్నాం 2 పై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.