Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం..పూజా కార్యక్రమాలు ఆ రోజే..!?
ఇక దర్శకత్వ బాధ్యతలను ఎవరు చేపడతారనే ప్రశ్నకు సంబంధించి కూడా ఒక ఆసక్తికర అనుమానం వినిపిస్తోంది. టాలీవుడ్‌కి భిన్న కథలను అందించిన ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. క్రిష్–బాలయ్య కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి విజయాన్ని అందుకుంది. అదే జోష్‌తో మళ్లీ బాలయ్య ఆలోచనలకు సరిపడే విజన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని టాక్.
కథ, స్క్రీన్ ప్లే విషయంలో కూడా క్రిష్ తో కలిసి రచయిత సాయి మాధవ్ బుర్రా కష్టపడి పనిచేశారని సమాచారం. ముఖ్యంగా, ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా బాలయ్య ఆలోచనలకు అనుగుణంగా, ఆయన సూచనలు, మార్గదర్శకతతోనే ముగింపుకి చేరిందని తెలిసింది. బాలయ్య సినిమాల కథలు, డైలాగులు ప్రత్యేకమైన శైలితో ఉండడం తెలిసిందే. అదే శైలిని కొనసాగిస్తూ, మోక్షజ్ఞకు ఒక సాలిడ్ హీరో ఇంట్రడక్షన్ ఇవ్వడానికి సాయి మాధవ్ బుర్రా ప్రత్యేక శ్రద్ధతో స్క్రిప్ట్‌ని అభివృద్ధి చేశారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
అంతేకాదు, ఈ భారీ సై-ఫై యాక్షన్ ప్రాజెక్ట్‌కు బాలయ్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశముందని తాజా టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కానీ అభిమానులు మాత్రం ఆ ప్రకటన కోసం అదిరిపోయే రీతిలో వేచి ఉన్నారు.