వైరల్ : టీమిండియా క్రికెటర్ కొత్త టాలెంట్.. అదిరిపోయే మ్యాజిక్?

praveen
ప్రస్తుతం భారత్లో క్రికెటర్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ఆటకు సంబంధించిన ఏదైనా చిన్న విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మార్చేస్తూ ఉంటారు. అయితే మైదానంలో ఎలా ఉన్నప్పటికీ అటు డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం టీమిండియా ఆటగాళ్లు ఎంతో సరదా సరదాగా గడుపుతూ ఉంటారు.. ఇలా టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఒకరిని ఒకరు ఆట పట్టించుకున్న వీడియో లు అప్పుడప్పుడు బిసిసిఐ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇప్పుడు ఇటీవలే బిసిసిఐ ఇలాంటి ఒక వీడియో ని పోస్ట్ చేసింది.

 ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో అదరగొట్టడం కెప్టెన్సీ తో ఇరగ దీయడమే కాదు తనలోని ప్రత్యేకమైన టాలెంట్ ను కూడా అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆశ్చర్యానికి గురు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక తన మ్యాజిక్ నైపుణ్యం తో అందరిని ఆశ్చర్యపరిచాడు శ్రేయస్ అయ్యర్. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చేతిలో ఒక కార్డును పెట్టాడు.  తనదైన శైలిలో మ్యాజిక్ చేసి ఏకంగా ఆ కార్డును మార్చేస్తాడు శ్రేయస్ అయ్యర్.

 దీంతో ఇదంతా గమనించిన టీమిండియా క్రికెటర్లు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఏకంగా మహమ్మద్ సిరాజ్ అయితే బిత్తిరి మొహం వేస్తాడు. తన చేతిలో ఉన్న కార్డుని కింద కొట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే శ్రేయస్ అయ్యర్ ఇంత అద్భుతంగా మ్యాజిక్ ఎలా చేయగలిగాడు అన్న విషయం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: