వైరల్ : కంటి ముందు రూ.1448 కోట్లు వున్నా.. ముట్టుకోలేని పరిస్థితి..!

Divya
కంటి ముందు రూ.1448 కోట్లు వున్నా.. ముట్టుకోలేని పరిస్థితి.. ఎందుకు..ఇలా..? అని ఆలోచిస్తున్నారా..? నిజానికి మన ముందు కంచంలో పంచభక్ష పరమాన్నాలు వున్నా.. కడుపులో నకనక లాడుతున్నా.. కళ్ళు ఆ భోజనాన్ని ఆకర్షిస్తున్నా.. నోట్లో లాలాజలం వూరుతున్నా.. కానీ తినడానికి వీలు లేకుండా ఉంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందో పరిస్థితి కూడా అలాగే ఉంది.. కళ్ళ ముందు అన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి ఉన్నప్పటికీ ఈ చిల్లిగవ్వ కూడా వాడుకలో లేని పరిస్థితిలో బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. అతని పేరు జార్జ్ వళానీ.. 1978 వ సంవత్సరం లో ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసేవారు.. ఈ కంపెనీకి కేంద్రంగా ఉదయపూర్ ఉండడం గమనార్హం.. ఈ కంపెనీ యజమానులతో ఈయనకు ఉన్న మంచి సంబంధాల కారణంగా .. కంపెనీకి సంబంధించిన 3500 షేర్లను కొనుగోలు చేయడం జరిగింది.. ఆ తర్వాత వయసు మీద పడటం తో డిస్ట్రిబ్యూషన్ వ్యవహారానికి పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఆ షేర్ల గురించి ఆయన మరిచిపోయాడు.
అయితే ఇటీవల ఆయన ఇంట్లో ఉన్న పాత పేపర్లను సర్దుతున్న సమయంలో.. ఆ షేర్లకు సంబంధించిన కొన్ని పేపర్లు బయటపడ్డాయి.. అయితే వీటిని ఆయన డిమార్ట్ గా మార్చాలని అనుకోగా అవి.. అప్పటికే ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ లిమిటెడ్ కంపెనీ తన పేరును సి ఐ ఇండస్ట్రీస్ గా పేరు మార్చుకుంది. అప్పట్లో జార్జ్ కొనుగోలు చేసిన మూడు వేల ఐదు వందలు షేర్ల విలువ ప్రస్తుతం రూ.1448 కోట్లు.

ఈ షేర్ల విలువ తెలుసుకున్న జార్జ్ వెంటనే  కంపెనీ మేనేజ్‌మెంట్‌ను కలిశారు.  వారు అప్పటికే డూప్లికేట్ పేరుతో ఆయన షేర్లను ఇతర వ్యక్తులకు బదలాయించారని తెలియడంతో జార్జ్ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యాడు. ఈ విషయాన్ని సెబీకి కూడా  తెలియజేశాడు. సెబీ లిస్టింగ్ కంపెనీ..పీఐ ఇండస్ట్రీస్‌ వారిని వివరణ కోరింది. కానీ..ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం జార్జ్ తన షేర్లకోసం యుద్ధం చేస్తున్నాడు. మరి ఆయనకు తన షేర్లు దక్కుతాయో..లేదో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: