స్మ‌శానంలో అస్థిపంజ‌రంతో మ‌హిళ ఆట‌లు..! భ‌య‌ప‌డుతున్న జ‌నాలు..

Paloji Vinay
ఎక్క‌డో ఉన్న స్మ‌శానం వైపు వెళ్లాలంటే కాస్త భ‌యంగానే ఉంటుంది. అదే ఆ దారిలో స్మ‌శాన వాటిక నుంచి వెళ్లాలంటే ఒళ్లు వ‌ణికిపోతుంది. ధైర్యం తెచ్చుకున్నా ఆ భ‌యం మాత్రం మ‌న నుంచి పోదు. ఆ ప్రాంతం నుంచి కాస్త దూరంగా వెళ్లిపోయే వ‌ర‌కు ఏదో అల‌జ‌డి ఉంటుంది. మ‌రి శ్మ‌శాన వాటిక‌లోకి వెళ్లాలంటే ప్యాంట్ త‌డిసిపోవ‌డం ఖాయం. కానీ ఓ ప్రాంతంలో శ్మ‌శాన వాటిక‌లోకి వెళ్లి ఏకంగా అక్క‌డున్న చ‌నిపోయిన వారి అస్థి పంజ‌రంతో ఆటలు ఆడారు ఓ వ్య‌క్తి.. అది కూడా మ‌హిళ‌. ఇప్పుడు ఆ మ‌హిళ చేసిన ప‌ని వైర‌ల్‌గా మారింది. అస‌లు.. ఆ మ‌హిళ ఎందుకు స్మ‌శాన వాటిక‌లోకి వెళ్లింది.. ఒక వేళ వెళ్తే అస్థి పంజ‌రాల‌తో ఆట‌లు ఎందుకు ఆడింది..? అనే ప్ర‌శ్న క‌లుగ‌క మాన‌దు.


   యూకే న‌గ‌రంలోని హాల్ సిటీలో ఉన్న శ్మ‌శాన వాటిక‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అయితే,  కొంతమంది ఆ స్మశానవాటిక ద‌గ్గర నుంచి వెళ్తున్నారు. ఇదే స‌మ‌యంలో శ్మ‌శాన వాటిక‌లో ఒంట‌రిగా ఓ మ‌హిళ క‌నిపించింది. అది కూడా మామూలుగా కాదు అస్థిపంజరంతో నృత్యం చేస్తున్న మహిళ.  మొదట ఆమెను చూసి వాళ్లు భ‌య‌ప‌డ్డారు త‌రువాత కొంచెం ఎక్కువ మంది గుమి కూడ‌డంతో దైర్యం చేసి మ‌హిళ అస్థిపంజ‌రంతో ఆట‌లు ఆడుతున్న దృశ్యాలను తమ మొబైల్‌ ఫోన్ల‌ లో తీశారు.
 
 ప్రస్తుతం ఆ శ్మ‌శాన వాటిక చిత్రాలు సామాజిక మాధ్య‌మాల్లో చక్క‌ర్లు కొడుతున్నాయి. కాగా ఈ ఘటన యుకెలోని హల్ సిటీలో జనరల్ స్మశానవాటిక సమీపంలో చోటు చేసుకుంది. ఆ ఫోటోలో సన్యాసిని వేషంలో ఉన్న ఒక మహిళ అస్థిపంజరం ప‌ట్టుకుని ఉన్న‌ట్టు.. ఆమె అస్థిపంజరంతో ఆడుకోవడం కూడా క‌నిపిస్తోంది. అలువైపుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాలను చూడడానికి త‌మ వాహ‌నాలు ఆపి మ‌రి శ్మ‌శాన వాటిక ద‌గ్గ‌రికి వ‌చ్చారు.

   ఆ సమయంలో సన్యాసిని వేష ధార‌ణ‌లో ఉన్న మ‌హిళ అస్థిపంజరాలతో ఆడుకోవడం, ఊగుతూ ఉండటం చూసి అందరూ భ‌యంతో పాటు ఆశ్చర్యపోయారు కూడా. ఆ మహిళ సన్యాసిని వలె దుస్తులు ధరించి తలపై కండువా కూడా వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: