వైరల్ : భూలోక నరకం.. అక్కడ అడుగు పెడితే ఇక మరణమే..!

Divya
భూలోక నరకం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది నీటిపై తేలియాడుతూ నగరం వెనీస్.. ఈ నగరానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన దీవి ఉంది.. ప్రజలు నివసించడానికి అనుకూలమే అయినప్పటికీ ఎవరు కూడా ఈ దీవికి వెళ్లడానికి అంత సాహసం చేయరు.. అక్కడ ప్రజలు నివసించడానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి కూడా ప్రభుత్వానికి ధైర్యం లేదు.. అలాంటప్పుడు ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి.. ఆ దీవిలో అడుగుపెట్టడానికి ఎందుకంత భయం అని ఆలోచిస్తున్నారా..?

ఇకపోతే ఆ  అందమైన దీవి పేరు పోవేగ్లియా.. ఇక ఇటలీ దేశ ప్రజలు ఈ దీవిని ఒక శవాల దిబ్బగా పేర్కొనడం గమనార్హం.. నిజానికి ఈ దీవి స్మశానం అయితే కాదు కానీ 16వ శతాబ్దంలో సుమారుగా లక్ష మందికి పైగా రోగులు  ప్లేగు వ్యాధి తో అక్కడ మరణించారని చెబుతారు.. ఇక చనిపోయిన వారంతా అక్కడ భూతాలుగా తిరుగుతున్నారు అని అక్కడి ప్రజల విశ్వాసం.. ముఖ్యంగా వెనీస్ తదితర ప్రాంతాలలో నివసించే ప్రజలు ఈ దీవిని పర్యటించేందుకు చాలామంది వెళ్లేవాళ్లు.. కానీ అక్కడికి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా తిరిగి రాలేదు ..

ఇంతకు ఆ దీవి లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే, 16వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి ఇటలీ దేశ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఒకవేళ రోగులు అక్కడే ఉంటే మరి కొంత మందికి సోకుతుందో ఏమో అన్న భయంతోనే ,శవాలను,రోగులను కూడా తీసుకెళ్లి ఆ దీవిలో వదిలేసేవారు. చాలామంది దీవి నుంచి బయటకు రాలేక ,ఆ శవాల మధ్య జీవితాన్ని గడిపి చికిత్స లభించక , అక్కడే చాలా మంది చనిపోయేవారు. చిన్న పిల్లలు కూడా ఇక్కడే మరణించడం జరిగింది.

మానవ పౌర హక్కుల సంఘం చట్టాలు ఎంత ప్రయత్నించినప్పటికీ, కానీ లాభం లేకపోయింది. ఇక చిట్టచివరికి ప్రభుత్వం అక్కడ ఒక చర్చితో పాటు రోగులు ఉండేందుకు ఒక భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. కాలక్రమేణా అక్కడ ఎక్కువ మంది చనిపోవడంతో చాలా మందిని పూడ్చిపెట్టారు .ఇక స్థలం లేకపోవడంతో కొంత మందిని దహనం  కూడా  చేయడం జరిగింది..
ఇకపోతే 1920 సంవత్సరంలో ప్రజల కోసం ఈ దీవిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. ప్రజలు అక్కడికి వెళ్ళడానికి నిరాకరించడంతో ఒక పిచ్చి ఆసుపత్రి ని కూడా నిర్మించడం జరిగింది. అంతే కాదు సినిమాల్లో జరుగుతున్న విధంగా.. ఆ హాస్పిటల్ లో ఒక డాక్టరు అక్కడ ఉన్న రోగుల పై రకరకాల ఎన్నో ప్రయోగాలు చేసి, చిత్రహింసలకు గురి చేసి, వారిని చంపి, ఆనవాళ్లు లేకుండా చేసే వాడు. అంతేకాదు అక్కడ పరిస్థితులు కూడా రోజు రోజుకు మరింత భయానకంగా మారిపోయాయి.
ఇప్పటికి కూడా ఆ దీవికి అత్యంత సమీపంలో నివసిస్తున్న ప్రజలు కూడా ప్రతిరోజు దీవి నుంచి వివిధ రకాల వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. చర్చి టవర్ లో ఉన్న గంట ఎవరి ప్రమేయం లేకుండానే దానంతటదే మోగుతుంది అని చెబుతుంటారు. ఇక ఇప్పటికీ అక్కడ ఎవరైనా వెళ్తే తిరిగి రారనే నమ్మకం ప్రజల్లో చాలా గాఢంగా నాటుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: