వైరల్ : ఆ నవారు మంచం ధర అన్నీ వేలా...?

Suma Kallamadi
సాధారణంగా పురాతన వస్తువులను వేలం పాట వేస్తుండటం మనం చూడొచ్చు. వాటికి మంచి ధర కూడా పలుకుతూ ఉంటుంది. చాలా మంది ఆ వస్తువులను దక్కించుకోవాలని ఒకరిని మించి మరొకరు పాట పాడుతూ వస్తువు ధరను అమాంతంగా పెంచేస్తుంటారు. అలా పురాతన వస్తువుల వేలానికి మంచి ధరే లభిస్తుంది. కాగా, తాజాగా ఓ నవారు మంచం నెట్టింట అమ్మకానికి పెట్టగా మంచి ధర పలికింది. వివరాల్లోకెళితే.. న్యూజిలాండ్ దేశంలోని ‘అన్నాబెల్లే బ్రాండ్’ నవారు మంచం ఆ దేశంలో బాగా పాపులర్. 

దానిని ఆ కంపెనీ వారు వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. దాని ప్రైస్‌ను 800 న్యూజిలాండ్ డాలర్లుగా ఫిక్స్ చేశారు. అనగా అది మన భారతీయ మనీలో రూ.41,297. అంటే ఒక మంచానికి సుమారుగా రూ.42 వేలు అన్నమాట. ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో అయితే రూ.పది వేల లోపే మంచి నవారు మంచాలు వచ్చేస్తాయి. అలాంటిది ఒకటే ఒక మంచానికే ఇంత ధర ఏంటి? అనే చర్చ షురూ అయింది. కాగా, ఈ నవారు మంచానికి ప్రత్యేకతలున్నాయట. ఈ నవారు మంచం అసలు ధర 1200 న్యూజిలాండ్ డాలర్లు అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనగా ఆ అమౌంట్ ఇండియన్ మనీలో రూ. 61,980 అన్నమాట. డిస్కౌంట్ పోగా దాని ధర రూ.41,297గా కంపెనీ వారు వివరించారు.

 నవారు మంచం ఎలా ఉంటుందంటే.. దీర్ఘ చతురస్రాకార ఉడ్‌కు నాలుగు కాళ్లు మధ్యలో దారాల అల్లిక ఉంటుంది. అయితే, దీనిని చూసినపుడు సాధారణమైనదిగానే అనిపిస్తుంది. కానీ, ఇది అత్యంత అరుదైనదని నిర్వాహకులు చెప్తున్నారు. ఇకపోతే అమ్మకంలో ఎంత ధర పలుకుతుందో మరి.. కాగా, ఈ నవారు మంచం ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో రోజువారీ ప్రొడక్ట్స్‌ను అంగట్లో అమ్మకానికి పెట్టడం మనం చూడొచ్చు. పచ్చటి మామిడాకులను ఇటీవల కొందరు అమ్మకానికి పెట్టారు. మొత్తంగా అమ్మకం సంస్కృతి బాగానే పెరగిపోతున్నదని అర్థమవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: