వైరల్ వీడియో : అమ్మో.. ఈమె తల్లేనా?
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ విషయంలోనే ఏకంగా కర్కశంగా ప్రవర్తించింది. ప్రస్తుతం అందరినీ సిగ్గుపడేలా చేసింది ఆ తల్లి. భర్తపై కోపాన్ని పిల్లలఫై చూపించి దారుణంగా ప్రవర్తించింది. ఏదైనా కష్టం వస్తే ఆదుకోవాల్సిన ఆ తల్లి ఏకంగా కడుపున పుట్టిన పిల్లల పాలిట కష్టం గా మారిపోయింది పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తూ వీడియో రికార్డ్ చేసి భర్త పంపించటం మొదలుపెట్టింది. ఇక ఆ తల్లి చేసిన పనులు చూస్తుంటే ఆమె కంటే ఒక సైకో మేలు ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చిన్నారిని హింసిస్తూ 250 వీడియోలు తీసింది ఆ తల్లి. ఈ ఘటన చిత్తూరులో వెలుగులోకి వచ్చింది.
భర్తపై కోపంతో రగిలిపోయిన ఆ తల్లి భర్తను ఏమి చేయలేక చివరికి చిన్నారి పైన ప్రతాపం చూపించింది. ఏకంగా కడుపున పుట్టిన బిడ్డను హింసలకు గురి చేస్తూ 250 వీడియోలను చేసింది. వీటిని భర్తకు పంపించి రాక్షసానందం పొందింది. చిన్నారి కాళ్లావేళ్లా పడుతూ బాధపడుతున్న కూడా ఎక్కడ ఆ తల్లి మనసు కరిగిపోలేదు. హింసిస్తూ నే ఉంది. ఈ పాశవిక ఘటన తమిళనాడులోని విల్లుపురం లో చోటు చేసుకున్నట్లు గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం బాధిత చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ కర్కశ తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నిందితురాలు చిత్తూరు జిల్లాకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.