వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

Suma Kallamadi
పూర్వం దేశాలన్నీ కూడా రాజ్యాలుగా ఉండేవన్న సంగతి అందరికీ విదితమే. రాచరికం అమలులో ఉన్న ఆ రాజ్యాల్లో రాజవంశీకులే పాలకులుగా ఉండేవారు. కాగా, రాజ్యానికి కొన్ని వింత రూల్స్ కూడా ఉంటుంటాయి. అలాంటి విచిత్ర సామ్రాజ్యం ఒక దగ్గర ఉంది. అది ఎక్కడంటే.. ఈ రాజ్యంలో మొత్తం జనాభా కేవలం 11 మంది కావడం గమనార్హం. ఈ రాజ్యపు రాజు నిక్కర్ వేసుకుని పడవ నడుపుతూ బతికేస్తుంటాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న రాజ్యం అయిన ఈ రాజ్యం ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్‌కు సమీపంలో మధ్యధరా సముద్రంలో ఉంది. ఈ రాజ్యం ఏర్పడి 180 ఏళ్లు గడిచిందట. దాని పేరే టవోలారా. 

ఈ దీవి 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. ఈ రాజ్య చక్రవర్తి పేరు ఆంటోనియో బర్దలివోని. అయితే, అందరూ రాజుల్లాగా ఇతను కిరీటాలేమీ ధరించడు. కేవలం నిక్కర్ వేసుకుని రాజ్యంతో తిరుగుతుంటాడు. ఈయనకు ఓన్లీ ఫుడ్ ఫ్రీగా లభిస్తుంది. మిగతా అన్ని అవసరాల కోసం ఈయన కష్టపడాల్సిందే. ఈ టవోలారా సామ్రాజ్యం ఇటీవలే 180వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. అయితే, అతి తక్కువ మంది జనాభా అనగా ఉన్న జనాభాతోనే ఉత్సవాలు కానిచ్చేశారట. 

టవోలారా రాజ్యం ఏర్పాటు ఇటలీ దేశంగా అవతరించకముందు సార్డీనియా రాజ్యంలో ఉండేదట. ఈ దేశపు రాజు చార్లో ఆల్బెర్టో. ఈ ప్రాంతంలో నివసరించే పురుషులు ఎవరైనా ఒకే పెళ్లి చేసుకోవాలనే రూల్ ఉంది. దీనిని అమలు చేసేవాడు రాజు ఆల్బెర్టో. రెండు పెండ్లిళ్లు చేసుకోవడం నేరం అని ప్రకటించడంతో పాటు ఎవరైనా అలాచేస్తే శిక్ష తప్పదని పేర్కొనేవాడు. అలా ఈ రాజ్యంలో ఓ డిఫరెంట్ రూలే అమలులో ఉంది. ఇకపోతే టవోలారా దీవిలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే.. బంగారు రంగు పళ్లు ఉండే మేకలు ఉంటాయిక్కడ. ప్రపంచంలో ఇటువంటి మేకలు ఇంక ఎక్కడా లేవని అవి ఇక్కడ మాత్రమే ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ డిఫరెంట్ గోట్స్ చూడటానికి సార్డీనియా రాజు 1836లో ఆ దీవికి వచ్చాడట. అలా ఈ డిఫరెంట్ గోట్స్ కూడా ప్రపంచానికి తెలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: