సైలెంట్ ఓటింగ్: షర్మిల గెలిచేనా.. ఆమె లెక్కలే వెరబ్బా..!

Divya
•అన్ని పన్నాగాలు పన్నినా షర్మిల గెలుస్తుందా
•అవినాష్ ఓటమి అనే భ్రమలో షర్మిల వుందా
•ఆ ఓట్లన్నీ వారికేనా..
(అమరావతి - ఇండియా హెరాల్డ్)
ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అభ్యర్థులు ఎవరైనా సరే తమ గెలుపు  పైన లెక్కేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలలో తమకు అనుకూలంగా ఓట్లు వేశారనే విషయం పైన కూడా ఆరా తీస్తూ ఉంటారు. అలా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా కొన్ని లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తోంది.. కడప లోక్సభ స్థానం నుంచి ఈమె కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగింది.. ఎన్నికల ప్రచారంలో ఈమె యొక్క సపోర్టుగా వివేకానంద కుమార్తె సునీత కూడా తోడుగా నిలిచింది. ముఖ్యంగా వివేకానంద హత్య కేసు కేంద్రంగా అక్కా చెల్లెలు ఇద్దరూ కూడా కీలకమైన పాయింట్ మీదే మాట్లాడుతూ ప్రచారం చేశారు.

వైయస్ జగన్ , వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పైన చెలరేగుతూ నానా మాటలు మాట్లాడారు. ముఖ్యంగా అవినాష్ రెడ్డి హంతకుడని.. అలాంటి నాయకుడికి ఏ విధంగా సీటు ఇస్తారంటూ కూడా వైసిపి అధినేత జగన్ ను పదేపదే దుర్భాషలాడారు. షర్మిల తాను రాజన్న బిడ్డనని కచ్చితంగా అందరూ గెలిపించాలంటూ కొంగుబట్టుకొని మరీ అభ్యర్థించింది. అటు షర్మిల ఇటు సునీత ఇద్దరూ కూడా ప్రచారం జోరుగా చేశారు. ముఖ్యంగా వైసిపి ఓటు బ్యాంకు ని టార్గెట్ చేయడం జరిగింది వీరు.

ముఖ్యంగా కడపలో వైసీపీ పార్టీకి అండగా నిలిచిన ముస్లిం, క్రిస్టియన్ , మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలలో షర్మిల గట్టిగానే ప్రయత్నం చేసింది.. ముఖ్యంగా తాను గెలవకపోయినా పరవాలేదు కానీ అవినాష్ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతోనే షర్మిల పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. కేవలం వైసీపీ ఓట్లను చీల్చి టిడిపి పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించేలా అన్ని అస్త్రాలను కూడా షర్మిల ఒక్కొక్కటిగా ప్రయోగిస్తూ వచ్చింది.. చివరికి తన తల్లి విజయమ్మతో కూడా తనకు ఓటు వేయాలనే విధంగా మాట్లాడించింది.

ఎన్నికల ప్రచారానికి ఒక గంట ముందు కూడా రాహుల్  ను కడపకు తీసుకువచ్చి ముస్లిం ఓటర్లను చీల్చే ప్రయత్నం కూడా చేసింది. ప్రస్తుతం అయితే షర్మిల అటు క్రిస్టియన్ ఓట్లు తమకే పడ్డాయని భ్రమలో ఉన్నది అలాగే ఎంపీ విషయానికి వస్తే ..క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తోంది.. షర్మిల గెలుపు కంటే అవినాష్ ఓటమే అంటూ షర్మిల చాలా బలంగా విశ్వసిస్తోంది. షర్మిల గెలుస్తాననే నమ్మకం లేకపోయినప్పటికీ అవినాష్ ను మాత్రం ఓడిస్తాననే ధీమాతో ఉంది.. దీన్ని బట్టి చూస్తే షర్మిలా లెక్కలు వేరు అనే విధంగా చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: