గన్నవరంలో సమ ఉజ్జీల సమరం.. వల్లభనేని వంశీ మోహన్ హ్యాటిక్ సాధిస్తారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులలా వైసీపీ, కూటమి నేతలు టెన్షన్ తో ఉన్నారు. గన్నవరంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా జరుగుతుండగా ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉండనుందని తెలుస్తోంది. గతంలో ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే ఈ ఎన్నికల్లో పార్టీలు మారి అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.
 
ఏపీ రాజకీయాల్లో చరిత్ర పరంగా కూడా గన్నవరం ప్రత్యేకం కాగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ఆ పార్టీ నేతలు భావిస్తారు. 2014, 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ టీడీపీ తరపున ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో కేవలం 800 ఓట్ల మెజారిటీతో వల్లభనేని వంశీ గెలిచారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి లక్ పరీక్షించుకుంటున్నారు.
 
వల్లభనేని వంశీమోహన్ హ్యాట్రిక్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ పోటీ చేయడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీల జనాభా ఎక్కువ కాగా ఈ ఎన్నికల్లో విజయం తమదేనని అటు యార్లగడ్డ ఇటు వంశీ నమ్మకంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా మెజార్టీ మాత్రం స్వల్పమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే జనం ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిస్తారనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మాత్రం ఫలితాలు వెలువడే వరకు ఆగక తప్పదని చెప్పవచ్చు. సమ ఉజ్జీల సమరంలో గెలుపు ఎవరిదనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. వల్లభనేని వంశీ హ్యాట్రిక్ కు బ్రేక్ పడుతుందో లేదో మరో రెండు వారాల్లో తేలిపోనుంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పార్టీలు మారి పోటీ చేయడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత కావడం గమనార్హం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: