ఆర్బిఐ కొత్త రూల్స్.. ఇకపై ఎప్పుడైనా జీతం జమ..

Divya

ప్రభుత్వ ఉద్యోగులకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రూల్స్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది ఏమిటంటే, సాధారణంగా సోమవారం నుండి శుక్రవారం వరకు బ్యాంకులు తెరిచి ఉండడం కారణం చేత , చాలా మంది ఖాతాలలో ప్రభుత్వాల నుండి జీతాలు జమ కాక, చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉండేవారు . ఇక ఈ ఇబ్బందులను అరికట్టేందుకు కొత్త రూల్స్ ను ఆర్ బీ ఐ  తీసుకువచ్చింది. ఇకపై వారానికి ఏడు రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలను కూడా మార్చింది. ఇక దీనినే మనం నాచ్ అని కూడా అంటారు. అంటే ఈ కొత్త రూల్స్ మనకు 2021 ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై నాచ్ సేవలు దాదాపు వారానికి ఏడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకులు తెరిచినప్పుడు , ప్రభుత్వ సేవలు మనకు అందుబాటులో ఉండేవి కావు.
ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని కొన్ని సార్లు నెల 1వ తేదీ వారాంతంలో రావడం వల్ల, ప్రజలు వారి జీతాలు ఖాతాలో జమ కాక, ఇబ్బంది పడే వాళ్లు. అంతే కాదు సోమవారం వరకు వేచి ఉండాల్సి వచ్చేది . ఇక పెన్షనర్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవడంతో, వీరందరిని దృష్టిలో పెట్టుకొని,  ఈ సరికొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక కస్టమర్ల సౌలభ్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి 24 x 7 టైమ్స్ ప్రకారం సమస్యను తొలగించి ,ప్రయోజనాలను పొందడానికి నాచ్ సహాయపడుతుంది.
ఇక bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆగస్టు ఒకటి 2021 నుండి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని , వారంలో ఏడు రోజులపాటు బ్యాంకులు అందుబాటులో ఉంటాయని వివరించారు.. ఇకపై వడ్డీ, జీతం, డివిడెండ్ అలాగే పెన్షన్ వంటి వివిధ రకాల క్రెడిట్ బదిలీలను సులభతరం చేస్తోంది. ఇక అంతే కాదు టెలిఫోన్, వాటర్ ,లోన్ ఇఎంఐ , మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, విద్యుత్ బిల్లు, గ్యాస్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకి కూడా ఈ సదుపాయం కల్పించారు. ఇకపై సోమవారం నుండి శుక్రవారం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బ్యాంక్ సంబంధిత లావాదేవీలను జరపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: