ప్రపంచంలో అతి చిన్న ఆవు పొడవు ఎంతో తెలిస్తే షాకే..?
ఈ ఆవు సాధారణ ఆవులు కన్నా భిన్నంగా ఉంటుంది. చూడడానికి చిన్నగా, ముద్దుగా భలే ఉంది ఈ ఆవు.అయితే ఈ ఆవు ప్రపంచంలోనే అతి చిన్న ఆవు అని దాని యజమాని పేర్కొన్నారు. అలాగే ఈ ఆవుకు ఒక పేరు కూడా ఉంది. దాని పేరు రాణి. ఈ ఆవు బంగ్లాదేశ్ లోని ఢాకా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిగ్రామ్‌లోని ఒక పొలంలో నివసిస్తుంది అంట.దీనిని ప్రత్యక్షంగా చూడడానికి చాలా మంది బాంగ్లాదేశ్ వెళుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా. ఈ ఆవు గురించి తెలుసుకుంటే మీరు కూడా రాణిని చూడడానికి బాంగ్లాదేశ్ వెళ్తారు మరి. ఎందుకంటే ఈ ఆవు పొడవు కేవలం 66 సెం.మీ పొడవుతో 26 కిలోలు బరువుతో ఉంటుంది.
ఈ ఆవు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన అతి చిన్న ఆవు కంటే 10 సెం.మీ చిన్నదని దాని యజమాని చెబుతున్నాడు.ఈ రాణి ఆవును చూడడానికి గత మూడు రోజుల్లో దాదాపు 15 వేల మందికి పైగా వచ్చారట. మేక కన్నా చిన్నగా ఉంటుందట ఈ ఆవు. అలాగే ఆవు మాంసం బంగ్లాదేశ్‌లో చాలా ప్రసిద్ది చెందింది అనే విషయం మన అందరికి తెలిసిందే. ఈ రాణి ఆవుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలోని ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి.ప్రతి ఒక్కరూ ఈ ఆవును స్వయంగా చూడాలని కోరుకోవడంలో తప్పులేదు అలా అని బంగ్లాదేశ్ దాక మనం వెళ్లడం కొంచం కష్టతరమైన పనే కాబట్టి ప్రస్తుతానికి రాణి ఆవు ఫోటోలు చూసి మురిసిపోదాం..