వైరల్ వీడియో: ఆమె గుర్రపు స్వారికి ఫిదా అవుతున్న నెటిజెన్స్.. ఎందుకో...

Purushottham Vinay
సాధారణంగా చీర ధరించిన స్త్రీ ఏమి చేయగలదు అని చాలా మంది అనుకుంటారు.కాని ఒడిశాలోని జహాల్ గ్రామానికి చెందిన మోనాలిసా అలాంటోళ్ల నోళ్లు మూయిస్తుంది.బుల్లెట్ బైక్ రైడింగ్ నుండి ట్రక్ డ్రైవింగ్ వరకు మోనాలిసా కేవలం చీరలోనే ప్రతిదాన్ని చేస్తుంది. ఇప్పుడు ఆమె తాజా వీడియోలో, ఆమె గుర్రపు స్వారీ చేయడాన్ని చూడవచ్చు.ఆ వీడియోకి నెటిజన్లు బాగా ఇంప్రెస్ అయ్యి దానిని ప్రతి క్షణం లైక్ చేస్తున్నారు.ఇక ఆ వీడియోని ఆమె భర్త బద్రి నారాయణ్ భద్రా అనే యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన ఈ వీడియోకు వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో వేలాది వ్యూస్ వచ్చాయి.

ఇక మోనాలిసా తనను యూట్యూబ్‌కు పరిచయం చేసిన తన భర్తకు ప్రేక్షకుల నుంచి వస్తున్న తన ఆదరణ మొత్తాన్ని క్రెడిట్ చేసింది. ఇక తన వీడియోస్ వెనకాల వున్న రియల్ హీరో సృజనాత్మక దర్శకుడు తన భర్తెనట. ఇక భద్రి వృత్తిరీత్యా సామాజిక కార్యకర్తట.ఇక ఈ వీడియోలకు వస్తున్న ఆదరణకు గాను మోనాలిసా అందరికి ధన్యవాదాలు తెలిపింది. మోనాలిసా ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడం ద్వారా నెలకు రూ .1.5 లక్షలు సంపాదిస్తుంది. మొనాలిసా వీడియోలు అప్‌లోడ్ అవుతున్న యూట్యూబ్ ఛానెల్ మే 2016 లో క్రియేట్ అయ్యింది. ఇక ఆ ఛానల్ కి ప్రస్తుతం 2.28 మందికి పైగా సబ్ స్క్రబర్స్ ఉన్నారు.

ఇక ఒట్టి యూట్యూబ్ లోనే కాకుండా, ఆమె వీడియోలు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా తెగ వైరల్ అవుతుంటాయి.ఆమె వోల్వో బస్సును నడుపుతున్న వీడియోలలో ఒకటి ఐఎఎస్ అధికారి అవనీష్ సరన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 75 వేలకు పైగా వీక్షణలు ఇంకా 8 వేలకు పైగా లైక్‌లు వచ్చినందున శరణ్ పోస్ట్ కు నెటిజన్ల నుండి అధిక స్పందన లభించింది.ఇక మోనాలీసా వీడియోపై స్పందిస్తూ చాలా మంది వినియోగదారులు ప్రశంసించారు.అంతేగాక ఈమె ప్రతి వీడియోలో సాంప్రదాయ దుస్తులలో ఉండటం అందరిని ఎంతగానో ఆకట్టుంటుంది.

మహిళలకు అనుసంధానించబడిన మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇది కాకుండా, మోనాలిసా మంచి జంతు ప్రేమికురాలు కూడా. ఇక తన గ్రామంలోని కోతులకు స్వయంగా తన చేతులతో ఆహారం తినిపిస్తుందట.ఆమె గురించి మాట్లాడుతూ, ఒక గ్రామస్తుడు ఆమె ప్రకృతి ప్రేమికురాలని ఇంకా తన పెంపుడు జంతువుల కోసం ఎక్కువ సమయం గడుపుతుందని చెప్పాడు. ఆమె ఇల్లు కూడా దాదాపు జూ ను పోలి ఉంటుందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: