వైరల్ : గర్భిణీ అని కనికరం లేకుండా కాల్చి చంపిన భర్త.. కెమేరాకు చిక్కిన దారుణం...
మంగళవారం బెయిల్ మీద బయటకు వచ్చిన సైనా.. తన సహాయకుడు షహదాత్ ద్వారా ఈ విషయం తెలుసుకుంది. దీంతో రోడ్డు మీదే పంచాయతీ పెట్టింది. తనకు, రెహనాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపింది. అయితే, ఆమె అతడితో వాదనకు దిగింది. ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో వసీం తన వద్ద ఉన్న గన్‌తో సైనాపై కాల్పులు జరిపాడు. ఆమెను రక్షించబోయిన సహాయకుడిని కూడా కాల్చాడు. అయితే వసీం ముందుగానే తన భార్యను చంపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం అతడు రెండు పిస్తోళ్లు వెంట తీసుకొచ్చాడు. సైనా చనిపోయేవరకు ఆమెపై కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. వసీం గ్యాంగ్‌స్టర్ అని, ఏడాది కిందటే సైనాతో పెళ్లయ్యిందని స్థానికులు తెలిపారు. ఈ హత్యలో ఆమె సోదరి రెహనాకు కూడా సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇక ఇలాంటి దారుణాలు ఒక్క రాజధానిలోనే కాదు దేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి.