వైరల్ : ఆ పోటీలో గెలిస్తే గేదెని బహుమతిగా ఇస్తారట....
ఈ జాతీయ పోటీల్లో గెలిచి విజేతగా నిలిచే ఉత్తమ రెజ్లర్ రూ.1.5 లక్షలు విలువ చేసే గేదెను ఇంటికి తీసుకెళ్లవచ్చని నిర్వాహకులు తెలిపడం జరిగింది. అదేంటీ? వీరికి మతిపోయిందా? అని అనుకుంటున్నారా? అయితే, ఈ గేదెను వారికి బహుమతిగా ఇవ్వడానికి వారు చెప్పిన కారణాన్ని కూడా మీరు తెలుసుకుంటే మీకు పూర్తి విషయం అర్ధమవుతుంది.అలా బహుమతిగా అందించే గేదె ద్వారా.. ఆ విజేతకు నిరంతరం ప్రోటీన్లు అందజేయడమే తమ ఉద్దేశమని చెబుతున్నారు. అంటే.. ఆ క్రీడాకారుడు ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లను పాలను తాగి మరింత బలంగా తయారు కావచ్చని వారి అభిప్రాయం. అయితే, ఈ బహుమతిపై తుది నిర్ణయం తీసుకొనేందుకు కమిటీ ఏర్పాటు చేశామని ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ప్రసాద్ వెల్లడించారు.డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఈ ఆలోచనల కలిగిందని, ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారని ప్రసాద్ తెలిపారు.
ఒక వేళ ఉత్తమ రెజ్లర్‌కు గేదెను అందించలేకపోతే.. రూ.1.5 లక్షల నగదును చెల్లిస్తామని తెలిపారు. అయితే, ఆటల్లో ఇలాంటి అరుదైన బహుమతులు అందించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కశ్మీర్‌లోని కుప్వార్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా చేపను బహుమతిగా అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...