వైరల్ : కుక్కకు.. తన బిడ్డను పరిచయం చేసిన పిల్లి?

praveen
సోషల్ మీడియా అనేది ఎన్నో వింతలకు విశేషాలకు చిరునామాగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా కారణంగా ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాలు వ్యవధిలోనే  తెలుసుకోగలుగుతున్నారు అందరూ. ఇక ప్రతిరోజు నేటిజన్స్ దృష్టిని ఆకర్షించే ఎన్నో ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.

 ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే ఎంతోమంది మనసును హత్తుకుంటూ ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. సాధారణంగా కుక్క పిల్లికి జాతి వైరం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండు ఎదురపడ్డాయి అంటే చాలు దారుణం గా గొడవ పడుతూ ఉంటాయ్. కానీ ఇటీవల కాలంలో ఎన్నో ఇళ్లలో కుక్కపిల్ల జాతి వైరాన్ని మరిచి స్నేహితుల్లాగా కలిసి మెలిసి ఉండడం చూస్తూ ఉన్నాము. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా జంతువులు అచ్చంగా మనుషుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇప్పుడు ఒక పిల్లి కూడా ఇలాంటిదే చేసింది. సాధారణం గా ఇక తమ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే తమ పిల్లలను లేదా తమ బంధువులను ఇక స్నేహితులకు పరిచయం చేయడం లాంటివి చేస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక పిల్లి కూడా ఇలాంటిదే చేసింది. ఏకంగా కుక్కతో స్నేహం పెంచుకున్న పిల్లి  తన పిల్లలను కుక్కకు పరిచయం చేస్తుంది. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారగా ఇది చూసి నేటిజన్స్ ఫిదా అవుతున్నారు. జాతి వైరాన్ని మరిచి జంతువుల స్నేహితులుగా మారితే మనుషులు మాత్రం ఇలా ఉండటం లేదు అని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: