నకిలీ తుపాకీతో చోరికి వెళ్ళాడు.. కాని చివరికి?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడదా కాస్త ఎక్కువగానే ఉంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇక రాత్రిపూట ఇంట్లోకి చొరబడి ఇక విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకుని అందిన కాడికి దోచుకుపోవడం లాంటివి చేసేవారు దొంగలు. కానీ ఇటీవల కాలంలో మాత్రం  ఏకంగా మారణాయుధాలు చూపించి బెదిరింపులకు పాల్పడి ఇక అందిన కాడికి దోచుకు పోవడం చేస్తున్నారు ఎంతో మంది దొంగలు. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి.

 ముఖ్యంగా తుపాకీలు చూపించి రెస్టారెంట్, హోటళ్లకు వెళ్లి ఏకంగా అక్కడ ఉన్న నగదు మొత్తాన్ని ఎత్తుకు వెళ్లడం లాంటివి ఎంతో మంది చేస్తున్నారు. ఇక ఇలాంటివి సిసి కెమెరాల్లో రికార్డు అవుతూ ఉండగా.. ఇక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి ఇలాంటి వీడియోలు. కాగా అమెరికాలోని టెక్సాస్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సౌత్ హ్యూస్టన్ లో నకిలీ తుపాకీతో దోపిడీకి ప్రయత్నించాడు ఒక దొంగ. రెస్టారెంట్లోకి వెళ్లి కస్టమర్లను బెదిరించి ఇక వారి దగ్గర నుంచి డబ్బులు విలువైన వస్తువులు కాజేయాలి అనుకున్నాడు.

 అయితే సదరు దొంగ దగ్గర ఉన్న తుపాకీ నకిలీది  అన్న విషయం తెలియక కస్టమర్లు కూడా తెగ భయపడిపోయారు అని చెప్పాలి. కానీ ఒక కస్టమర్ కాస్త ధైర్యం చేసి దొంగను చావు దెబ్బ కొట్టాడు. అదును చూసి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి దొంగను షూట్ చేశాడు. దీంతో దొంగకు తూటాలు తగిలి అక్కడికక్కడే కూలిపోయాడు. అంతటితో ఆగకుండా ఇక అతని దగ్గరికి వెళ్లి మరి కస్టమర్ పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆ దొంగ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది. ఆత్మ రక్షణ కోసం చేసిన హత్య కావడంతో అమెరికా చట్టాల ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: