ఇలాంటి లోకో పైలట్ ఉంటే.. పట్టాలపై ఎవరు వీడియోలు చేయరు?

praveen
గతంలో ఎంతో మంది సమాజం కోసం బ్రతుకుతున్నాం అంటూ చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో జనాలు మాత్రం కేవలం సోషల్ మీడియా కోసమేబ్రతుకుతున్నాం అన్న విధంగా పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడానికి జనాలు చేస్తున్న పిచ్చి పనులు అంతా కాదు అని చెప్పాలి. ఇలా ఏకంగా ప్రాణాలకు తెగించి మరీ విచిత్రమైన విన్యాసాలు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అలాంటి వీడియోలు అటు ఇంటర్నెట్ ని తెగ ఊపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే రైలు పట్టాల పై వీడియోలు చేయడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ వీడియోలు చేస్తున్న సమయంలో ఎటువైపు నుండి అయినా రైలు దూసుకు వచ్చింది అంటే కేవలం రెప్పపాటు కాలంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి విషయం అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం కావాలని రైలు పట్టాలపై ట్రైన్ వస్తుందని తెలిసినా కూడా ఏకంగా చిత్ర విచిత్రమైన వీడియోలు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. చివరికి ఇలా చేసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో లోకో పైలట్ ప్రవర్తించిన తీరు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇలాంటి లోకో పైలట్ అన్ని రైళ్లలో ఉంటే మాత్రం ఇలా రైలు పట్టాలపై వీడియోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోతుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి రైలుకు ఎదురుగా పట్టాలపై కూర్చున్నాడు. రైలు వస్తూ ఉన్నా కూడా పట్టాలపై నిల్చని చేతులు ఊపుతూ ఉన్నాడు. రైలు దగ్గరికి రాగానే పక్కకు లేచి వెళ్లిపోయాడు. అయితే అతని వల్ల రైలును ఆపాల్సి వచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన లోకో పైలట్ రైలు దిగొచ్చి మరీ అతని వెంబడించి మాడుపగిలేలా ఒక్కటి ఇచ్చాడు. ఇక లోకో పైలట్ కొట్టిన దెబ్బకు సదరు ఆకతాయి కింద పడిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: