పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేని వయసులో.. రెండు చేతులతో రాసేస్తున్న చిన్నారి?

praveen
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ ఉన్న వారికి కొదవలేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో అయితే ఎంతో మంది చిన్నారులు సైతం తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకొని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన సమయంలో కూడా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సాధారణంగా చిన్న పిల్లలకు చదువుకోవడం అన్నా లేదంటే హోంవర్క్ రాయడం అన్న మహా చెడ్డ చిరాకు.

 ఈ క్రమంలోనే పిల్లలు హోంవర్క్ నుంచి తప్పించుకునేందుకు చెప్పే సాకులు కూడా కొన్ని కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఏదో ఒకటి చెప్పి హోంవర్క్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఒకవేళ తల్లిదండ్రులు మందలించి హోంవర్క్ చేయమంటే ఎంతో బాధపడుతూ హోంవర్క్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్నారి మాత్రం ఎంతో ఇష్టంగా హోంవర్క్ చేస్తుంది. అది కూడా ఒక్క చేతితో కాదు రెండు చేతులతో. ఏకంగా తనలో ఉన్న ప్రతిభతో ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. చివరికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 సాధారణంగా ఎడమ చేతితో లేదా కుడి చేతితో రాయడం చేస్తూ ఉంటారు చాలామంది.  ఒకవేళ రెండు చేతులతో రాసే అలవాటు ఉన్న ఒక్కోసారి ఒక్కో చేతిని వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చిన్నారి మాత్రం ఏకంగా ఒకేసారి రెండు చేతులతో రాయడం చూడవచ్చు.  ఇక ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇది ఎలా సాధ్యమైంది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రెండు చేతులతో ఎక్కడ తడబాటు లేకుండా ఎంతో కాన్ఫిడెంట్ తో చకచకా రాసేస్తుంది అని చిన్నారి. అది కూడా పెన్సిల్ కూడా సరిగ్గా పట్టుకోలేని వయసులో ఆ చిన్నారి ఇలా రాస్తూ ఉండటం చూసి అందరూ షాక్ అవుతున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: