అయ్య బాబోయ్.. రన్నింగ్ బస్సులో.. కిటికీ నుంచి బస్సు ఎక్కిన అమ్మాయి?

praveen
సాధారణంగా కాలేజీకి వెళ్లే కుర్రాళ్ళు కొన్ని కొన్ని సార్లు సరదా కోసం చేసే పనులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇక కాలేజీకి వెళ్లేటప్పుడు లేదా కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బస్సుల్లో విద్యార్థులు ప్రయాణించే తీరు అందర్నీ కాస్త భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బస్సులో ఎంత స్థలం ఉన్నప్పటికీ విద్యార్థులు మాత్రం ఎందుకో ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ప్రమోదాల బారిన పడుతూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే అబ్బాయిలు ఇలా చేయడంలో పెద్దగా వింత ఏమీ లేదు అని చెప్పాలి. కానీ అమ్మాయిలు కూడా ఇలా ఫుట్ బోర్డింగ్ చేస్తూ ఉండడం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. ఇక కొంతమంది అయితే బస్సు ఎక్కడానికి వచ్చినట్లు కాదు ఏదో సాహసోపేతమైన విన్యాసాలు చేయడానికి బస్సులో ప్రయాణిస్తున్నాం అన్న విధంగా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. హర్యానాకు చెందిన అమ్మాయి కూడా ఇలాంటిదే చేసింది.  ఏకంగా రన్నింగ్ బస్సులోకి కిటికీలోంచి ఎక్కీ అందర్నీ విస్మయానికి గురి చేసింది.

 అబ్బాయిలకు కూడా సాధ్యం కానీ ఈ ప్రమాదకరమైన విన్యాసాన్ని చేసి అందరిని నోరేళ్లపెట్టేలా చేసింది అమ్మాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే బస్సు విద్యార్థులతో నిండిపోయింది. ముందు కానీ వెనకనుంచి కానీ బస్సులోకి ఎక్కేందుకు అవకాశం లేదు. దీంతో బస్సు నిండా విద్యార్థులు ఉన్న సమయంలో ఎక్కడ కాలేజీకి లేట్ అవుతుందో అని భావించిన సదరు అమ్మాయి బస్సు రన్నింగ్ లో ఉందని తెలిసినా కూడా సాహసం చేసి ఇక కిటికీలోంచి బస్సు ఎక్కింది అని చెప్పాలిYour browser does not support HTML5 video..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: