క్లాస్ రూమ్ లో టీచర్ డాన్సులు.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్?

praveen
ఒకప్పుడు స్కూల్ కు వెళ్ళినప్పుడు టీచర్లు ఎలా ఉండేవారో అందరికీ తెలుసు. చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎంతో కోపంగా విద్యార్థులు వైపు చూస్తూ చదవకపోతే తోలు తీస్తాం అనే విధంగా వ్యవహరించేవారు. అయితే కేవలం అలా కోపంగా చూడటమే కాదు కొన్ని కొన్ని సార్లు సరిగ్గా చదవకపోతే చేతిలో ఉన్న బెత్తంతో వాతలు పడిన కొట్టిన అనుభవం కూడా కొంతమందికి ఎదురయ్యే ఉంటాయి. అయితే ఇలా టీచర్ కొట్టిందని తల్లిదండ్రులకు చెబితే.. నువ్వు సరిగ్గా చదవలేదేమో అందుకే టీచర్ కొట్టింది. మంచి పని చేసింది అని ఒకప్పుడు తల్లిదండ్రులు అనేవారు. కానీ ఇప్పుడేమో పిల్లల్ని ఎలా కొడతారు కొట్టడానికే మీ దగ్గరికి పంపించామ అంటూ టీచర్లను నిలదీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.

 అంతే కాదండి ఒకప్పుడు బెత్తం పట్టుకుని గంభీరంగా కనిపిస్తూ విద్యార్థులను భయపెట్టే టీచర్లు ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఏకంగా విద్యార్థుల్లో విద్యార్థుల్లా కలిసిపోయి ఏకంగా స్నేహితుళ్లాగా పాఠాలు బోధిస్తున్న టీచర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే స్కూల్లో పాఠాలు బోధిస్తున్న ఎంతోమంది టీచర్లు తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులకు డాన్స్ పాటలు నేర్పిస్తూ సరదాగా గడుపుతున్న వీడియోలు గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. భోజ్పురి సాంగ్ కి ఒక క్లాస్ రూమ్ లో టీచర్ డాన్స్ చేసింది. ఇక ఆ తర్వాత టీచర్ తో పాటు పిల్లలు కూడా కెమెరా వైపు చూస్తూ ఆనందంలో హ్యాపీగా డాన్స్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ వీడియో పై అటు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీచర్ విద్యార్థులతో కలిసి మెలిసి ఉంటుందని కామెంట్ చేస్తుంటే.. ఇంకొంతమంది ఒక టీచర్ గా మంచి విషయాలు నేర్పాల్సింది పోయి సినిమా పాటల పై డాన్స్ చేసి విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: