ఆ ఊరి పేరే దీపావళి.. ఎక్కడుందంటే?

Satvika
కొన్ని ఊర్ల పేర్లు వింతగా వుంటాయి.వాటిని ఎందుకు పెట్టారు అని జానాలు కూడా ఆలొచిస్తారు..అలాంటి ఊరే దీపావళి..ఇది పండుగ పేరు కదా మరి ఊరికి ఎందుకు పెట్టారు. అని ఆలోచిస్తున్నారా.. అదే ట్విస్ట్ దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.. పండగల పేర్లతో ఊర్లు ఉండడం చాలా అరుదు. ఉత్తరాంధ్రలో మాత్రం దీపావలి  పేరుతోనే ఓ ఊరుంది.శ్రీకాకుళం  నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఈ ఊరు ఉంది. దీపావళి అనే పేరు ఇప్పుడు పెట్టింది కాదు.. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు స్థానికులు చెబుతుంటారు. దీనిపై చుట్టుపక్క గ్రామాల్లో ఓ కథ కూడా చెబుతుంటారు. ఆ కథ ప్రకారం.. శ్రీకాకుళాన్ని పాలించిన రాజు కళింగపట్నం ప్రాంతానికి అప్పుడప్పుడు గుర్రంపై ఇదే ప్రాంతం మీదుగా వెళ్లేవారు.

అలా వెళ్తున్నప్పుడు ఒక రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు రాజును గుర్తించి సపర్యలు చేశారు. రాజు కోలుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ గ్రామానికి దీపావళిగానే నామకరణం చేశారని చెబుతుంటారు..అయితే ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ ఊరి పేరు దీపావళిగానే నమోదై ఉంది. గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు. అయితే ఊరి పేరులోనే దీపావళి ఉండడంతో.. గ్రామ ప్రజలు అన్ని పండగల్లోనూ దీపావళినే ఘనంగా జరుపుకుంటారు. ఇది తమకు ఎంతో ప్రత్యేకమైన పండగగా పేర్కొంటారు.. బంధువులను కూడా భారీగా పిలిచి ఓ వేడుకలా జరుపుకుంటారు..

ఊరికి దీపావళి అని పేరు ఉండడం పట్ల గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేస్తుంటారు.. హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరు ఉండటం నిజంగా గర్వించదగ్గ అంశం అంటున్నారు. పండగ పేరుతో ఉన్న ఇలాంటి గ్రామంలో జన్మించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అంటూ ఆ ఊరి వాళ్ళు అంటున్నారు..అందుకే అక్కడి ప్రజలు ప్రతి పండుగను చాలా గ్రాండ్ గా చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: