ట్రైన్ లో సీటు కోసం.. లేడీస్ ఎలా కొట్టుకున్నారో చూడండి?

praveen
సాధారణంగా లోకల్ ట్రైన్స్ ఎంతల కిక్కిరిసిపోయి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని ప్రాంతాల ప్రజలు తరచూ లోకల్ ట్రైన్స్ లో ప్రయాణిస్తూ ఉంటారు. తద్వారా ఎప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉన్నట్లుగానే అటు లోకల్ ట్రైన్స్ లో కూడా జనాలు కనిపిస్తూ ఉంటారు. కనీసం కూర్చోవడానికి నిలబడడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ట్రైన్ లో సీట్ విషయంలో కూడా వివాదాలు తలెత్తడం కూడా చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే.

 సాధారణంగా ట్రైన్ లో ఇలా సీటు విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు కాసేపు వాగ్వాదం చేసుకోవడం ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు.. ఏకంగా సీట్ విషయంలో మహిళల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త ఏకంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతవరకు వెళ్ళింది. ఇద్దరు మహిళలు కూడా ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. పక్కన ఉన్నవారు విడిపించేందుకు ప్రయత్నించినా కూడా వారు వెనక్కి తగ్గలేదు అని చెప్పాలి.

 అయితే ఇలా కొట్టుకుంటున్న ఇద్దరు మహిళలను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసుపై కూడా ఆ మహిళలు దాడి చేయడం గమనార్హం. ఈ ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగ చెక్కర్లు కొడుతుంది. పోలీసులు 27 ఏళ్ల మహిళా నిధితురాలని అరెస్టు చేశారు. ముంబైలోని తానే - పాన్వెల్  మధ్య నడిచే లోకల్ ట్రైన్ తుర్బ్ స్టేషన్ రాగానే ఓ సీటు ఖాళీ అయింది. అప్పటివరకు నిలబడిన ఇద్దరు మహిళలు ఆ సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరి మధ్య  వాగ్వాదం జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.. అక్కడికి వచ్చిన మహిళ కానిస్టేబుల్ పై కూడా దాడి చేయగా ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: