ఈ ఏడాది దొరికిన మొదటి పులస చేప.. ధర తెలిస్తే షాకే?

praveen
పులస చేప.. ఈ పేరు వింటే చాలు నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా నోరూరిపోతూ ఉంటుంది. పులస చేప తింటే ఎంత బాగుంటుంది అని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు అందరూ. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అయితే పులస చేపలకు ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు అని చెప్పాలి. అటు మార్కెట్లో ఎన్ని రకాల చేపలు ఉన్నప్పటికీ పులస చేప ఉంది అంటే చాలు అందరి దృష్టి కూడా అటువైపే వెళుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే పోటీపడి మరి పులస చేపను కొనుగోలు చేయడానికి ఎంతో మంది ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అన్నట్లుగా చేపలందు పులస చేప వేరయ్య అన్నట్లుగా నాన్ వెజ్ ప్రియులు వ్యవహరిస్తూ ఉంటారు.

 అంతేకాదు పుస్తెలు అమ్మి అయినా   సరే ఒక్కసారైనా పులస చేప తినాలి అన్నది గోదారోళ్ళు ఎప్పుడు ఒక సామెత చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది ఎంత రేటు పెట్టుకొనడానికైనా సరే సిద్ధపడుతూ ఉంటారు అని చెప్పాలి.  అందుకే ఇలా పులస చేపకు చెందిన వేలం ఎప్పుడైనా జరిగిందంటే చాలు అధికాస్త సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా పులస చేప మరోసారి రికార్డులు బద్దలు కొట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఫిష్ మార్కెట్లో మూడు కేజీల పులుసు చేప ఏకంగా 22 వేల రూపాయలు పలికింది.

 ఇప్పటివరకు ఈ ఏడాది దొరికిన మొదటి పులస చేప కావడంతో ఇక ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులు ఈ పులస చేపను దక్కించుకునేందుకు తెగ పోటీపడ్డారు. ఈ క్రమంలోనే వేలంపాటలో చివరికి రాజోలుకు చెందిన బైడిశెట్టి శ్రీరాములు ఈ పులస చేపను దక్కించుకున్నాడు అని చెప్పాలి. అయితే పులుస చేపను ఒక్కసారైనా లైఫ్లో తినాలి అని అంటారు. ముఖ్యంగా వర్షాలు పడిన తర్వాత దొరికిన మొదటి చేప టేస్ట్ చూస్తే ఇక ఆ కిక్కే వేరు అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాంటి అదృష్టం తనకు దక్కిందని చెబుతున్నాడు బైడిశెట్టి శ్రీరాములు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: