ఇదెక్కడి తెలివి రా బాబు.. ఈ ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా?

praveen
సాధారణంగా రోజూ తినే రెగ్యులర్ వంటకాలు కొన్ని కొన్ని సార్లు విసుగు వస్తూ ఉంటాయి . ఇలా విసుగు వచ్చినప్పుడు కొత్త వంటకాలు ట్రై చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. తినడానికి వినడానికి చూడటానికి బాగుండే వంటకాలను మాత్రమే కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం కొంత మంది చిత్ర విచిత్రంగా కొత్త వంటకాలను ట్రై చేస్తూ ఉంటారు. ఇక దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే యాక్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇక మరి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే బాబోయ్ ఇదేం తెలివి రా నాయనా అని అనుకుంటూ ఉంటారు ఎంతోమంది. ఎందుకంటే కలలో కూడా ఊహించని వింత కాంబినేషన్ లతో అంతకుమించి అనేంత వింతైన వంటకాలు  తయారు చేస్తూ ఉంటారు.

 అయితే ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త వంటకానికి సంబంధించిన వీడియో చూసి ఏకంగా ఆహార ప్రియులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేక్కడ ఐడియా రా బాబు అని కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు చాక్లెట్ సమోసా, టమోటా కచోరీ, ఐస్ క్రీం  కచోరీ, వెట్ ఫిష్ ఫ్రై, పచ్చిమిర్చి హల్వా, కొత్తిమీర ఐస్క్రీమ్ ఫాంట మ్యాగి ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల వెరైటీ ఆహారపదార్థాలు వంటకాలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ గా మారిపోయాయి. ఇప్పుడు ఇలాంటి ఒక కొత్త వంటకం వైరల్ గా మారిపోయింది.  ఇక దీనిని చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు అని చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిన వంటకం పేరు ఏంటి అని అనుకుంటున్నారు కదా. దాని పేరు గ్రీన్ చిల్లి ఐస్ క్రీం.

 ఇక ఈ సరికొత్త వింత అయిన ప్రయోగాన్ని చూసి ఐస్ క్రీమ్ ప్రియులందరూ కూడా షాక్ లో మునిగి పోతున్నారు. వైరల్ అవుతున్న వీడియో లో ముందుగా దుకాణదారుడు మిర్చి ముక్కలు గా చేస్తాడు. ఆ తర్వాత వాటి పైన ఐస్ క్రీమ్ తయారు చేసే పదార్థాలను వేసి ఐస్ క్రీమ్ రోల్స్ ను తయారు చేస్తారు. ఆ తర్వాత కాసేపు ఫ్రిజ్లో ఉంచి కస్టమర్లకు సర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలా సర్వ్ చేసే ముందు ఐస్ క్రీమ్ రోల్స్ ని పచ్చిమిర్చితో టాపింగ్ చేస్తూ ఉంటాడు. ఇక వెరైటీ వంటకం చూసి ఐస్ క్రీమ్ ప్రియులందరూ కూడా షాక్ కీ గురవుతున్నారు. ఇదేం టెస్టు రా బాబు ఇలాంటి ఐస్క్రీం కూడా ఎవరైనా తింటారా అని కామెంట్ కూడా పెడుతున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: