వైరల్ : హ్యారీ పోటర్ ని తలపించేలా అరుదైన " చాక్లెట్ కప్ప"..

Divya

కప్పలు ఉభయచర జీవులు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇవి ముఖ్యంగా నీటి కుంటలలో గుడ్లు పెడుతూ, తమ జీవన సంతానాన్ని పెంపొందించుకుంటూ నీటిలోనూ, భూమిపైన సులభంగా జీవించగలవు. ఈ కప్పలు ఎక్కువగా ఆర్థ్రోపోడా, అనేలిడా, మొలస్కా జీవులను తిని జీవిస్తాయి. ఇవి ఎక్కువగా ప్రపంచమంతటా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో విస్తరించి ఉంటాయి. అయితే ఎక్కువ జాతులు చాలా వరకు అరణ్యాలలో కనిపిస్తాయి. ఈ కప్పలు సుమారు ఐదు వేల జాతులు ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. అయితే వీటిలో కొన్ని జాతులు అంతరించిపోయాయి అన్న విషయం కూడా తెలిసిందే.
ముఖ్యంగా ఈ కప్పలను ఆరు వర్గాలుగా విభజించారు. అందులో ఒకటి
రానా : ఇవి సాధారణ జాతికి చెందిన కప్పలు.
బుఫో : గోదురు కప్పలు.
హైలా : చెట్ల మీద ఉండే కప్పలు.
రాకోఫోరస్ : ఎగిరే కప్పలు.
ఎలైటిస్ : మంత్రసాని కప్పలు.
డార్ట్ పాయిజన్ కప్ప : ఈ కప్పలు విషంతో నిండి ఉంటాయి.
అయితే ఇలా వర్గీకరించిన కప్పలలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సరి కొత్తగా ఒక చాక్లెట్ కప్పను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తల బృందం న్యూ గినియా ఫారెస్ట్ లో లోతట్టు వర్షారణ్యంలో కనుగొనబడిన ఈ ఆరోగ్యమైన జాతి కప్ప, హారీపోటర్ సినిమాలో మనకు అగుపించే చాక్లెట్ కప్ప లాగ ఉంది. ఇక ఇది చూసిన హారీపోటర్ అభిమానులు నిజజీవితంలో కూడా చాక్లెట్ కప్ప ఉంటుందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.అయితే, అవి హ్యారీ పాటర్ సినిమాల్లో కనిపించే వాటికి భిన్నంగా ఉంటాయి.

సెంటర్ ఫర్ ప్లానెటరీ హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్వీన్స్లాండ్ మ్యూజియంలో పనిచేస్తున్న ఆలివర్, ఈ కప్పకు మీరా మీరా అని పేరు పెట్టారు. లాటిన్ లో మీరా అంటే ఆశ్చర్యం లేదా వింత అని అర్థం. సాధారణంగా వీటిని చెట్టు కప్పలు అని కూడా పిలుస్తారు. అయితే ఆస్ట్రేలియన్ జర్నల్ ఆఫ్ జువాలజీలో ప్రచురించబడ్డ ఈ "చెట్టు కప్పలు" అని పిలువబడే కప్పలు ఆకుపచ్చ చర్మానికి ప్రసిద్ది చెంది వుంటాయి. కానీ ఇప్పుడు కనిపించిన ఈ అరుదైన కప్ప ముదురు గోధుమ రంగు చర్మం కలిగి ఉండడంతో పరిశోధకులు దీనికి "చాక్లెట్ ఫ్రాగ్"అని పేరు పెట్టారు.

 "ఇక లిటోరియా మీరా జాతికి దగ్గరి బంధువు ఆస్ట్రేలియన్ ఆకుపచ్చ చెట్టు కప్ప. కొన్ని జాతులు ఒకేలా కనిపిస్తాయి. సాధారణంగా ఈ జాతి కప్పలు ఆకుపచ్చగా ఉంటాయి. మరి కొన్ని కొత్త జాతులు మనోహరమైన చాక్లెట్ రంగు ని కలిగి ఉంటాయి" అని అధ్యయనం యొక్క సహ రచయిత పాల్ ఆలివర్ తెలిపారు. అయితే ప్రస్తుతం హ్యారీ పోటర్  అభిమానులు ఈ చాక్లెట్ కప్పను వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: