వైరల్ ఎహే: సింహం చేసిన విన్యాసం చూస్తే అదిరిపోవలసిందే.. ?

venugopal

అడవికి రారాజు మృగరాజు అన్న విషయం తెలిసిందే.. దీని పంజా రుచి చూసిన జంతువులు ప్రాణాలతో బ్రతకడం కష్టం.. ఇక ఈ సింహం ఆకలితో ఉన్నప్పుడు చేసే వేట మరీ ప్రత్యేకంగా ఉంటుందట.. ఇలాంటి సమయంలో ఇది ఎంతటి సాహసానికి అయినా తెగిస్తుందని చెప్పే వీడియో ఒకటి ఇప్పుడు మీ ముందు ఉంది..

 

 

ఈ వీడియోలో ఆకలితో నకనకలాడుతున్న సింహానికి కొందరు సందర్శకులు ఆహారాన్ని అందిస్తారు.. అయితే ఆ ఆహారాన్ని సింహం ఉన్న వైపు, వారికి వీలైనంత ఎత్తులో విసిరేస్తారు.. అప్పుడా సింహం దాన్ని అందుకోవడానికి హై జంప్ చేస్తున్న తీరు చూస్తే ఎవరైనా ఫిదా అవక తప్పదు.. ఈ సంఘటన జరిగింది నమీబియాలో ఉన్న విన్ఢోక్ సఫారీ పార్క్‌లో..

 

 

ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది సందర్శకులు అందమైన ప్రదేశాలను, మందిరాలను, పార్క్‌లను చూడమే కాదు.. ఉత్సాహం ఎక్కువై దానికి కాస్త ధైర్యం తోడైతే సఫారీ పార్కులను సందర్శిస్తూ, అక్కడ ఉన్న కౄరమృగాలను ఫుల్ లైవ్‌లో చూస్తున్నారు.. కొందరైతే వాటితో ఆటలు కూడా ఆడతారు..

 

 

ఇదంతా సఫారీ పార్క్‌లో ఉండే యానిమల్ ట్రైనర్ల సహాయంతో మాత్రమే సాధ్యం అవుతుందని గమనించగలరు. ఇక సఫారీ పార్క్‌లోకి వెళ్లినప్పుడు అత్యుత్సాహాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది.. ఎందుకంటే అవి ఆలోచన లేని జంతువులు.. ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తాయో ఊహించడం కష్టం..

 

 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.. సింహం చేసిన హై జంప్ చూసిన నెటిజన్స్ అయితే దీన్ని ఒలంపిక్ పోటీలకు పంపిస్తే ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం ఖాయమని కామెంట్స్ పెడుతున్నారు.. అంతేకదా ఆకలితో ఉంటే మనిషి కూడా ఎన్నిదారుణాలు చేయడానికి వెనుకాడడు.. ఇక కౄరమృగాల సంగతి వేరే చెప్పక్కర్లేదు.. మీరు కూడా ఈ సింహం చేస్తున్న విన్యాసాన్ని చూసి ఆనందించండి.. 

 

 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/dDpTLtK38T0" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: