రూ.1/- తోనే 17 కి.మీ. ప్రయాణం?







గోవు హిందువుల ఆరాధ్య దేవత. ఆ మాత దేహాంగాలన్నీ మానవ జాతికి ప్రయోజనాలిచ్చేవే. చివరికి గోవు మల మూత్రాలు సైతం. ఓవుల పెంపకం వలన చాలా ఉపయోగాలు ఉంన్నాయని మనకు ఇన్నాళ్లుగా తెలుసు. అయితే ఇప్పుడు మరో కొత్త ఉపయోగము జతవుతుందదని కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ నిరూపించింది. ఆవుపేడ నుంచి తయారుచేసిన బయోగ్యాస్‌తో బస్సులను నడిపిస్తున్నారు. దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. సాధారణంగా డీజిల్‌తో నడిపించే బస్సులకు ఒక లీటర్ డీజిల్తో నాలుగైదు కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజి రాదు. డీజిల్ ధర లీటరు 60 రూపాయలకు పైనే ఉంది. 




కానీ ఇప్పుడు వీరి నూతన సృజనాత్మక తో కనుగొన్న సరి కొత్త విధానములో బయోగ్యాస్‌తో బస్సు నడిపితే, 17కిలోమీటర్లకు ఒక్కో ప్రయాణికుడికి ఒక్కరూపాయి మాత్రమే ఖర్చవుతుందట. తాజాగా ఈ బస్సును కోల్‌కతా నగరం లో ఉత్తరాన ఉన్న "ఉల్టాదంగా నుంచి దక్షిణాన ఉన్న గరియా" వరకు ప్రయోగాత్మకంగా నడిపించారు. ఈ ప్రయాణంలో మొత్తం 17.5 కిలోమీటర్ల దూరానికి సరిగా లెక్క కడితే ఒక్కో ప్రయాణికుడికి ఒక్క రూపాయే అత్యధికంగా ఖర్చయింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఇంత అత్యంత చవకైన ప్రజారవాణా వ్యవస్థ కు దీహదం చేసే ప్రయోగం ఇదేనని అంటున్నారు. ఢిల్లీలో బస్సులను సీఎన్‌జీతో నడిపించినా కూడా కిలోమీటరకు దాదాపు నాలుగైదు రూపాయలు చార్జీ అవుతోంది.




"ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గ్రూప్" అనే ఈ కంపెనీ ఆవుపేడ నుంచి బయోగ్యాస్ ప్రత్యేక విధానం లో తయారుచేసింది. ఈ సంస్థ అశోక్-లేలాండ్ కంపెనీతో చేతులు కలిపింది. 54 సీట్లున్న బస్సును రూ. 13 లక్షలకు అందించారు. ఇలాంటివి సుమారు 15 బస్సులను త్వరలోనే కోల్‌కతాలో నడిపిస్తామని చెబుతున్నారు. అన్నింటిలోనూ ఒకే విధమైన చార్జీలు ఉంటాయి. 





మరో విధానములో జంతువులు, వృక్షాల వ్యర్థాల నుంచి మీథేన్‌తో కూడిన బయోగ్యాస్ తయారవుతుంది. ఇది రంగులేని ప్రమాద రహిత పర్యావరణ అనుకూలమైన ఇంధనం. దీన్ని వాహనాలకు, విద్యుత్-ఉత్పత్తికి, వంటకు కూడా ఉపయోగించ వచ్చు. 





ప్రస్తుతం తాము బీర్భూమ్ జిల్లాలోని తమ ప్లాంటులో ఆవుపేడ నుంచి బయోగ్యాస్ తయారుచేస్తున్నామని, దీన్ని ట్యాంకర్ల ద్వారా కోల్‌కతా తరలిస్తున్నామని "ఫోనిక్స్ ఇండియా గ్రూపు" చైర్మన్ & మనేజింగ్ డైరెక్టర్ జ్యోతి ప్రకాష్ దాస్ తెలిపారు. బయోగ్యాస్ ఉత్పత్తికి కిలో రూ. 20 చొప్పున ఖర్చవుతుంది. కిలో గ్యాస్‌తో బస్సు 5 కిలోమీటర్లు నడుస్తుంది. దాస్ బోటనీలో పీహెచ్‌డీ చేశారు. గత 8 ఏళ్లుగా బయోగ్యాస్ మీద పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు తాము జర్మనీ సంస్థ నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకుని, కిలో గ్యాస్‌తో 20 కిలోమీటర్లు నడిచేలా చూస్తున్నామని అన్నారు. ట్యాంకులో 80 కిలోల గ్యాస్ పడుతుం దని, దాన్ని ఫుల్ చేస్తే 1600 కిలోమీటర్లు వెళ్తుందని, అందుకే చార్జీలు బాగా తక్కువ ఉంటాయని ఆయన వివరించారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: