బుల్లిపిట్ట:మొబైల్లో కనిపించే ఈ డాట్ ఎందుకో తెలుసా..?

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో 100 లో తొంబై ఎనిమిది శాతం మంది మొబైల్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే వీటి వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల హ్యాకర్ల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మనకు తెలియకుండానే మన మొబైల్ ని ట్రాక్ చేయడమే కాకుండా మన మొబైల్ లోని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా లాగేస్తూ ఉన్నారు హ్యాకర్స్. అయితే మన మొబైల్లో ఎవరైనా మనకు తెలియకుండా ట్రాక్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఒక చిన్న డాట్ ద్వారా మనం గుర్తించవచ్చు వాటి గురించి చూద్దాం.

స్మార్ట్ మొబైల్ లో కుడివైపు భాగంలో ఆకుపచ్చ లేదా నారింజ రంగు చుక్క కనిపిస్తూ ఉంటుంది.. ఇలా కనిపించింది అంటే కచ్చితంగా మన మొబైల్ ని ఇతరులు యాక్సెస్ చేయడానికి అనుమతి ఇచ్చినట్లుగా మనం గుర్తించాలి. మొబైల్స్ లో ఆకుపచ్చ లేదా నారింజ లైట్ ఆన్ లో ఉంటే మనం కచ్చితంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.. గ్రీన్ లైట్ ఉంటే మన మొబైల్ కెమెరాను మూడవ వ్యక్తి యాక్సెస్ చేస్తున్నారని అర్థం... ఒకవేళ ఆరెంజ్ లైటు ఉంటే కచ్చితంగా థర్డ్ పార్టీ మన మైక్రో ఫోన్ యాక్సిస్ చేయడానికి అనుమతించబడిందని విధానాన్ని గుర్తించాలి.

మనం ఇలా ఆకుపచ్చ లేదా నారింజ వంటి డాట్లను గుర్తిస్తే అప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలి. మన సెట్టింగ్ లోకి వెళ్లి పర్మిషన్ మేనేజర్ అనే విభాగం లోకి వెళ్లి అక్కడ ఏ యాప్ ద్వారా మనం యాక్సెస్ చేసాము అనే విషయాన్ని తెలుసుకుని అవాంచిత యాప్స్ లను సైతం మనం డిలీట్ చేయాలి. దీని ద్వారా మనం మన డేటాని సైతం పూర్తిగా సేఫ్ అవ్వడమే కాకుండా హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు తమ మొబైల్ లో ఇలాంటి డాట్స్ కనిపిస్తాయా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: