బుల్లి పిట్ట: రోడ్డు మీద ఉండే ఈ రంగుల మైల్ స్టోన్స్.. ఉపయోగం ఏమిటంటే..?

Divya
మనలో చాలా మంది హైవేలపైన లేదా ఏదైనా రోడ్డుమీద వెళుతున్నప్పుడు మనకి మైల్ స్టోన్ రాయి కనిపిస్తూ ఉంటుంది. అది మన గమ్యాన్ని ఎంత దూరం ఉందని విషయాన్ని తెలియజేస్తుందని విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆ మైల్ రాళ్లకు విభిన్నమైన రంగులు సైతం వేస్తూ ఉంటారు. రకరకాల రంగులతో కూడిన మైల్ రాళ్లు రోడ్ల పైన ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో ఎల్లో, ఆరంజ్ ,బ్లాక్, గ్రీన్ కలర్ రంగులలో మైలురాళ్లు ఉంటాయి. అయితే ఈ మైలురాళ్లు రంగులో ఎందుకు ఉంటాయని విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1). పసుపు రంగు:
మైల్ రాయికి పసుపు రంగు ఉంటే.. ఆ కలర్ మైల్ స్టోన్స్ హైవేల పైన  మాత్రమే ఉంటుంది. వీటి నిర్వహణమంతా కూడా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత.
2). అకు పచ్చని రంగు:
ఏదైనా మైల్ రాయికి మనం వెళుతున్నప్పుడు ఆకుపచ్చని మైల్ స్టోన్ ఉంటే అది రాష్ట్ర రహదారులను సూచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా హైవే కాని రోడ్డు నిర్మిస్తే ఆ రోడ్డు పక్కన ఇరాళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ రహదారి బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం లోనే ఉంటుంది.
3). బ్లూ కలర్ బ్లాక్ కలర్:
ఈ రంగులతో కూడిన మైల్ రాయి కనిపిస్తే అది పెద్ద నగరం జిల్లా కేంద్రంలోనికి ప్రవేశిస్తున్నట్టుగా అర్థము.. ఈ నిర్వహణ అంతా కూడా పరిపాలనతోని ముడిపడి ఉంటుంది.

4). ఆరంజ్ రంగు మైల్ స్టోన్:
ఈ మైల్ స్టోన్ గ్రామ రహదారుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండేటు వంటి వాటిలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ఉదాహరణకు ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన కింద ఇలాంటి రోడ్లను నిర్మిస్తూ ఉంటారు.
ఫారెస్ట్ వంటి ప్రాంతాలలో కూడా మొత్తం గ్రీన్ కలర్ తో కలిగి ఉన్న మైండ్ స్టోన్ ఉంటుంది. వాహనాలలో ప్రయాణించే వారికి ఇవి చాలా ముఖ్యము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: