బుల్లి పిట్ట: మీ కారు మైలేజ్ తగ్గుతోందా.. అయితే ఈ టిప్స్ వాడండి..!!

Divya
మనలో కొంతమందికైనా సొంత వాహనాలు ఉండనే ఉంటాయి.. మనం చేసే కొన్ని తప్పుల వల్ల కారు మైలేజ్ కూడా అప్పుడప్పుడు తగ్గినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల డిజిల్ ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుకునే కొన్ని టిప్స్ పాటించడం వల్ల కారు మైలేజ్ ని పెంచుకోవచ్చు వాటి గురించి చూద్దాం.
కారు మైలేజ్ పెంచుకోవడానికి ముఖ్యమైన మార్గం కారును జాగ్రత్తగా మెయింటైన్ చేయడమే. కారులో ఎక్కువగా మురికి ఫిల్టర్లలో డస్ట్ వంటివి ఉండడం వల్ల ఎక్కువగా ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఇంజన్లో మురికి ఉండడం వల్ల గాలి ప్రవాహాన్ని నిరోధిస్తుంది దీనివల్ల ఇంజన్ వేడెక్కుతుంది.

కారు మైలేజ్ ని పెంచుకోవాలి అంటే కచ్చితంగా అందుకు తగ్గట్టుగానే లోడ్ ని ఉంచుకోవాలి.. ఎక్కువగా లోడ్ కారు లోపల ఉంటే ఇంధనం మరింత ఖర్చవుతుంది.

కారుకి ఇంజన్ ఆయిల్ అనేది మైలేజ్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మనం సరైన ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ ని ఉపయోగిస్తున్నామో లేదా చెక్ చేసుకోవాలి.

టైర్లలో ఎల్లప్పుడూ సమానంగా గాలిని ఉండేలా మెయింటైన్ చేయాలి.. కారు ఇంధన సామర్థ్యం తో దీనికి నేరుగా సంబంధం ఉంటుంది. టైర్ పైన ఎక్కువ ప్రెజర్ పడితే ఇంధనాన్ని ఎక్కువగా వినియోగిస్తుంది.

అధిక మైలేజ్ రావాలి అంటే గేర్లను సరిగ్గా మార్చడం ముఖ్యము..మ్యానువల్ ఆటోమేటిక్ గేర్లు వస్తూ ఉండడంతో సరైన వేగంతో గేర్లను ఉపయోగించాలి.
ఏదైనా సందర్భంలో చక్రాలని తప్పుగా అమర్చిన కారు మైలేజ్ పైన ప్రభావం చూపుతుంది. ఒకవేళ టైర్లు అరిగిపోయిన కూడా మైలేజ్ పైన ప్రభావం చూపిస్తుంది.

బయట చాలా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే కారులో AC ఉపయోగించడం మంచిది.. ఏసీ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇంజన్ పైన ఒత్తిడి కలుగుతుంది. దీని ద్వారా మైలేజ్ కూడా తగ్గుతుంది. కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు విండోస్ ను తీసుకోవడం మంచిది.

కారు మైలేజ్ రావాలి అంటే పెడల్ను అదేపనిగా ప్రెస్ చేయకూడదు.. సాధ్యమైనంతవరకు సులభంగా వేయడానికి ప్రయత్నించాలి.. చాలా స్పీడ్ గా వెళ్లి ఆ తర్వాత బ్రేక్ వేయడం వల్ల  ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: