మీ బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ ఇలా వాడుతున్నారా?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం నుంచి వ్యక్తిగత డేటా వరకు వివిధ ఖాతాల్లో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మన డేటా రక్షణకు కచ్ఛితంగా పాస్ వర్డ్ లను సెట్ చేసుకోవాలి. కానీ అన్ని ఖాతాల కోసం పాస్ వర్డ్ లను గుర్తుంచుకోవడం కష్టమైన పనిగా మారింది. అందువల్ల చాలామంది పాస్ వర్డ్ మేనేజ్ చేసుకోవడం కోసం పాస్ వర్డ్ మేనేజర్లను ఉపయోగిస్తున్నారు.

అయితే  మీ ఆధారాలను బహిర్గతం చేసే పాస్ వర్డ్  మేనేజర్ తో ఉన్న ప్రధాన సమస్యల భద్రత గురించి సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  స్మార్ ఫోన్ మ్యాను ఫ్యాక్చర్లతో పాటు, వెబ్ బ్రౌజర్ల యూజర్లకు పాస్ వర్డ్ మేనేజర్స్ ఇన్ బిల్ట్ అప్లికేషన్లను ఆఫర్ చేస్తాయి. ఈ పాస్ వర్డ్ మేనేజర్స్ యాప్ అకౌంట్ల పాస్ వర్డ్ లను స్టోర్ చేయడంతో పాటు వెబ్ సైట్, యాప్స్ లో లాగిన్ అయ్యే సమయంలో ఆటోమేటిక్ గా ఫిల్ చేస్తాయి.

వీటివల్ల ఆండ్రాయిడ్ యూజర్లకు పెద్ద ముప్పు ఏర్పడింది. ఈ యాప్ లో ఓ పెద్ద  సెక్యూరిటీ సమస్య  తాజాగా బయటపడింది.  హ్యాకర్లు ఈ లూప్ హోల్ ని ఉపయోగించి పాస్ వర్డ్ లను సులభంగా తస్కరించగలరు. ఈ తీవ్రమైన సమస్యను భారతదేశంలోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్మర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ పరిశోధకులు కనుగొన్నారు.

ఈ భద్రతా సమస్యను ఆటోఫిల్ అని పిలుస్తారు.  ఈ సమస్య  ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆటోఫిల్ పాస్ వర్డ్ ఫీచర్ ను ప్రభావితం చేస్తోంది. ఈ ఫీచర్ తో వెబ్ బ్రౌజర్ ను తెరవకుండానే వెబ్ పేజీల్లో పాస్ వర్డ్ లను ఫిల్ చేయవచ్చు. ఈ ఫీచర్ ను లాంచ్ చేయడానికి గూగుల్ వెబ్ వ్యూ పేజీని ఉపయోగిస్తుంది. ఈ యాప్ ల పొరపాటు బేస్ యాప్ నకు పాస్ వర్డ్ లను లీక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వన్ పాస్ వర్డ్, లాస్ట్ పాస్,, కీపర్, ఎన్ పాస్ వంటి ప్రముఖ పాస్ వర్డ్ మేనేజర్లలో ఈ సమస్య ఉందని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: