పీల్చే గాలి కూడా కొనుక్కునే రోజులు రాబోతున్నాయా?
తాజాగా దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లోని గాలి నాణ్యత ఆందోళన కర స్థాయికి చేరుకుంది. దిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కమ్మేసి ప్రజలను ఊపిరాడకుండా చేస్తోంది. ఇలా జరగడానికి కారణం దిల్లీ పరిసర ప్రాంతాల్లోని రైతులు పంట వ్యర్థాలు కాల్చడం ఒక కారణమైతే నగరంలో వాహనాల ద్వారా వచ్చే పొగ మరో కారణంగా చెబుతున్నారు. తాజాగా దిల్లీలో దీపావళి సందర్భంగా జరిగిన రచ్చ గురించి అందరకీ తెలిసిందే.
అయితే దీని వెనుక కుట్ర కోణం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దిల్లీలో గాలి ప్రమాద కర స్థితిలో ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ కార్పొరేట్ శక్తులు కుట్రలు కూడా ఉన్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే హరియాణా, పంజాబ్ రైతులు వందల ఏళ్లుగా పంట వ్యర్థాలను కాల్చుతున్నారు. దీంతో పాటు దీపావళి కూడా ఏటా వచ్చే పండుగే. వాస్తవానికి దీపావళి కాలుష్యం దిల్లీ కాలుష్యంలో 0.4శాతమే.
గతంలో కాలుష్యం కొలిచే పరికరాలు ఉన్నా ఇప్పుడే ఈ చర్చ ఎందుకు జరుగుతుంది. ఇక్కడే కార్పొరేట్ కంపెనీల మాయాజాలం ఉంది. ప్రస్తుతం అత్యంత లాభదాయకమైన వ్యాపారం స్వచ్ఛమైన గాలి పేరిట ఆక్పిజన్ అందించడం. ఎయిర్ ప్యూరిఫైర్ పేరుతో మధ్య తరగతి వాళ్లకు కూడా అలవాటు చేసి ఆక్సిజన్ రూంలు ఏర్పాటు చేయడం. ప్రస్తుతం 15నిమిషాల ఆక్సిజన్ కోసం దిల్లీ ప్రజలు రూ.299 కడుతున్నారు. రాబోయే కాలంలో ఆక్సిజన్ దాదాపు రూ.50వేల కొట్ల వ్యాపారం చేస్తోంది. ప్రస్తుతం మినరల్ వాటర్ క్యాన్లు కొంటున్నట్లే భవిష్యత్తులో ఆక్సిజన్ కొనాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కార్పొరేట్ కంపెనీల మాయాజాలం.