బడ్జెట్ 2026: సామాన్యులకు వరాలు.. 5 పెద్ద ప్రకటనలు..?

Divya
2026-2027 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే విషయంపై సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి బడ్జెట్లో కూడా సామాన్యులకు వరాలు కురిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఈసారి రాబోయే బడ్జెట్లో 5 పెద్ద ప్రకటనలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. మరి వాటి గురించి చూద్దాం.


వ్యక్తిగతంగా ఆదాయ పన్ను  పరిమితిని రూ .13 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నది. దీంతో రూ  13 లక్షల రూపాయల వరకు ఎలాంటి టాక్స్ లేకుండా జీతం తీసుకోవచ్చు.


పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద 2 కిలో వాట్స్  రూ. 30వేల నుంచి రూ .60 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే మార్చినాటికీ 40 లక్షల ఇళ్లకు, 2027 నాటికి కోటి ఇళ్లకు సౌర విద్యుత్ పలకలన ఏర్పాటు చేయాలని లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తోంది.


పీఎం కిసాన్ పథకం కింద రూ. 6000 రూపాయలు రైతులకు ప్రతి ఏడాది అందిస్తోంది. దీనిని 50% పెంపుతో  రూ.9000 రూపాయల వరకు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ప్రతి విడతలో మూడు వేల రూపాయల చొప్పున ఇచ్చేలా చేయబోతున్నారట.


రైల్వే ట్రాక్స్ మెరుగుపరచడం, కొత్త రైళ్లను పెంచడం, రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ లాంటివి తగ్గించడం వాటిపైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అలాగే 300కు పైగా అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం 70 ఏళ్ళు వయసు దాటిన వారికి రూ. 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా(ఆయుష్మాన్ భారత్) చికిత్స అందిస్తోంది. దీనిని 60 ఏళ్లకే తగ్గించవచ్చని వినిపిస్తోంది. ఏడాదికి రూ .5లక్షల రూపాయలు ఉచిత చికిత్స తో పాటు, హార్ట్ సర్జరీ, క్యాన్సర్ వంటి వాటితో పాటుగా పెద్ద శాస్త్ర చికిత్సలకు సైతం కవర్ అయ్యేలా రూల్స్ మార్చవచ్చని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: