నాని ఫ్యూచర్ ప్లాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చిన ‘ది ప్యారడైజ్’..!
నిజానికి ఈ సినిమాను మార్చి 26, 2026న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ ఇంకా 50 శాతం పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇందులో హీరోయిన్ కాయాడు లోహర్ కూడా పాల్గొంటున్నారు.పెండింగ్ షూటింగ్ మరియు గ్రాఫిక్స్ వర్క్ (VFX) కారణంగా సినిమాను జూన్ 2026 కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని జక్కన్న శిష్యుడు శ్రీకాంత్ ఓదెల గట్టిగా ఫిక్స్ అయ్యారు.నాని ఈ సినిమా గురించి చెబుతూ.. ఇది ఇండియాస్ 'మ్యాడ్ మ్యాక్స్' అని అభివర్ణించారు. జడలు కట్టిన జుట్టు, గుబురు గడ్డం, కండలు తిరిగిన శరీరంతో నాని లుక్ ఇప్పటికే ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం నాని తొలిసారిగా చొక్కా విప్పి తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించబోతున్నారు. ఇందులో నాని 'జడల్' అనే పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక అణగారిన వర్గం కోసం పోరాడే యోధుడి కథ అని టాక్.
రైట్ నౌ సౌత్ ఇండియాలో అనిరుధ్ అంటే ఒక బ్రాండ్."నాని - అనిరుధ్ కాంబోలో వచ్చే పాటల కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశంఉంది.ఈ పాటతోనే ప్రమోషన్స్ హోరు పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు."ఈ సినిమాలో ఉన్న మరో పెద్ద సర్ప్రైజ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ నెగటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. నాని వర్సెస్ మోహన్ బాబు సీన్లు థియేటర్లలో రచ్చ లేపడం ఖాయం. అలాగే రాఘవ్ జుయల్, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు వంటి వారు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
నాని ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సీస్ రైట్స్ ఇప్పటికే రికార్డు ధరకు అమ్ముడయ్యాయంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. దాదాపు ₹150 కోట్ల భారీ బడ్జెట్‌తో నాని కెరీర్లోనే కాస్ట్లీస్ట్ మూవీగా ఇది రూపొందుతోంది.మొత్తానికి 'ది పారడైజ్' సినిమాతో నాని తన రేంజ్ ని గ్లోబల్ లెవల్ కి తీసుకెళ్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర దసరా లాంటి హిట్ కాకుండా, అంతకు మించిన ఒక 'రాయల్' హిట్ కొట్టడానికి నాని అండ్ టీమ్ సిద్ధమయ్యారు. జూన్ లో వచ్చే ఈ 'పారడైజ్ ఎఫెక్ట్'కి రికార్డులు బద్దలవ్వాల్సిందే!