బుల్లి పిట్ట: మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..!!

Divya
సాధారణంగా మన ఏదైనా డబ్బు అవసరమైతే కచ్చితంగా మన బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అలాంటి సమయంలో మన క్రెడిట్ స్కోర్ ను బట్టి మనకు ఎంత లోన్ వస్తుందని విషయాన్ని తెలియజేస్తారు బ్యాంకు అధికారులు సాధారణంగా స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది.. ఒక వ్యక్తి కనీసం ఆరు నెలల ఆర్థిక లావాదేవుల ఆధారంగానే ఈ సిబిల్ స్కోర్ ను క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలామందికి క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటుంది అలాంటి వారిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మన బ్యాంకు సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉండవచ్చు.. అయితే 750 నుంచి 900 మధ్య ఉంటే అది అద్భుతమైన సిబిల్ స్కోర్ అని చెప్పవచ్చు.. సిబిల్ స్కోర్ 550 నుంచి 650 మధ్య సగటు కేటగిరిలో ఉంటే పర్వాలేదు అని.. 300 నుంచి 500 పరిధిలో వచ్చే సివిల్ స్కోర్పూర్ కేటగిరికిందికి లభిస్తుంది. అయితే ఈ సివిల్ స్కోర్ ను ఈజీగా మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్లో అధికారిక వెబ్సైట్ సిబిల్ స్కోర్ ని ఓపెన్ చేయాలి అందులో ఒక ఫారం నింపిన తర్వాత..(పేరు ,పుట్టిన తేదీ, అడ్రస్, పిన్కోడ్ ,ఐడి ప్రూఫ్) వంటి వాటిని తెలుపవలసి ఉంటుంది.
ఇలా మీ వివరాలను వెరిఫై చేసుకోవడానికి ఒక ఓటిపి ని కూడా వెబ్సైట్ పంపుతుంది. సివిల్ మరింత సమాచారం కోసం మరిన్ని వివరాలను కూడా అడగవచ్చు. అయితే ఒక్కసారి ఈ సిబిల్ స్కోర్ ను ఉచితంగా అందిస్తుంది. సిబిల్ స్కోర్ ను కచ్చితంగా ప్రతిసారి చెక్ చేసుకోవాలి అంటే ఇలాంటి ప్లాన్స్ ఎంచుకోవాలి.. రూ.550 ఒక నెల బేసిక్ ప్లాన్.. రూ.800 కీ 6 నెలల స్టాండర్డ్ ప్లాన్ కి 1200 ఉంటుంది. సిబిల్ స్కోర్ వెబ్సైటును కూడా విజిట్ చేయవచ్చు. పాన్ కార్డు అందించడం కూడా సిబిల్ స్కోర్ తెలియజేస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: